హౌసెస్ పై మంత్రికి సూటి ప్రశ్న

ఏపీ అసెంబ్లీః హౌసెస్ కు సంబంధించి క్వశ్చన్ అవర్ లో వైయస్ జగన్ సంబంధిత మంత్రిని నిలదీశారు. బాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి  ఫిభ్రవరి 2017దాకా సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ తో లక్షా 8వేల ఇళ్లు, స్టేట్ గవర్నమెంట్ మరో 26వేల ఇల్లు కట్టాము అని గొప్పలు చెప్పారు. లక్షా 35వేల ఇళ్లు ఇవాల్టికి కట్టేశామని చెబుతున్నారు. నేను మంత్రిగారిని ఒక్కటే అడుగుతున్నా...బాబు అధ్యక్షతన డిసెంబర్ 21,22న జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో వీరి చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే మొత్తం రూరల్ లో 48 వేల 985 ఇళ్లకు గ్రౌండెడ్ మార్కింగ్, అర్బన్ లో 2,789 ఇళ్లకు గ్రౌండెడ్ మార్కింగ్ మాత్రమే చేయడం జరిగింది. మంత్రిని సూటిగా క్వశ్చన్ వేస్తున్నా..లక్షా 35వేల ఇళ్లకు ఇంటూ లక్షన్నర వేసుకుంటే యావరేజ్ గా కనీసం అంటే 6వేల కోట్లు అవుతుంది. మూడేళ్ల మీ బడ్జెట్ లో ప్లాన్ ఎమౌంట్ ఎంత ఖర్చుపెట్టారు, 6వేల కోట్లకు మ్యాచ్ అవుతుందా లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Back to Top