ఎండిపోయిన పంటలకు ఏం సమాధానం చెబుతావ్ బాబూ..?

వైయస్ఆర్ జిల్లాః తొండూరు మండలంలో వైయస్ జగన్ పర్యటించారు. తుమ్మలపల్లిలో ఎండిపోయిన చినీ తోటలను పరిశీలించారు. పులివెందులకు నీళ్లిచ్చామని బాబు గొప్పలు చెప్పుకుంటుంటే, ఇక్కడ ఎండిపోయిన చినీ తోటలు దర్శినమిస్తున్నాయని వైయస్ జగన్ అన్నారు. ఎండిపోయిన పంటలకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.  ఇక్కడ ఇంత కరువున్నా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం  ముందుకు రాకపోవడంపై మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు చేసిన జిమ్మిక్కుల కారణంగా రైతులు రూ. 2 అపరాధ వడ్డీ కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ఏ అంశంలో చూసినా బాబు  రైతులను మోసం చేసే పనిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు నోరు తెరిస్తే అబద్ధాలేనని వైయస్ జగన్ ఫైర్ అయ్యారు. 

మరోవైపు, పులివెందులలో పసుపు రైతులు వైయస్ జగన్ ను కలిశారు. పంటలకు గిట్టుబాటు లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ హయాంలో క్వింటా రూ. 16వేల ధర ఉంటే ప్రస్తుతం రూ.4,500కు పడిపోయిందని వైయస్ జగన్ అన్నారు. ఇలా ఉంటే రైతులు ఎలా బతుకుతారని చంద్రబాబును ప్రశ్నించారు. వెంటనే పసుపు రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Back to Top