<strong>() తాగునీటి కోసం ప్రజల కష్టాలు</strong><strong>() కరువు మండలాల ప్రకటనలోనూ ఆలస్యం</strong><strong>() గ్రామీణ నీటి సరఫరాకు నిధుల కొరత</strong><strong>() ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్</strong>హైదరాబాద్) కరువును ఎదుర్కోవటంలో ప్రభుత్వం అనసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎండగట్టారు. గణాంకాలతో సహా వివరాల్ని అసెంబ్లీలో బయట పెట్టారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్ బాషా తదితరులు కరువు అంశం మీద ప్రశ్నలు లేవనెత్తారు. దీని మీద ప్రభుత్వ వివరణ అస్పష్టంగా ఉండటంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జోక్యం చేసుకొన్నారు.ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.రాష్ట్ర వ్యాప్తంగా కరువు తాండవిస్తుంటే ప్రభుత్వం మాత్రం భూ గర్భ జలాలు పెరిగాయి అని చెబుతోంది. దానికి కారణం తమ గొప్పతనమేఅంటోంది. కొన్ని చోట్ల తుపానులు పుణ్యమా అని పెరిగాయోమో తప్ప మామూలుగా పెరగలేదు. నీటి కోసం కిలోమీటర్ల దూరం జనం వెళ్లాల్సి వస్తోంది. ఈ మేరకు అన్ని పేపర్లలో వార్తలు వస్తున్నాయి. ఫోటోలతో సహా వేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి..దాదాపు అన్ని జిల్లాల వివరాలు ఇస్తున్నారు. ఈనాడు పత్రిక అంటే మీ అఫీషియల్ గెజిట్ లో ప్రచురించారు. దాని నుంచే చదువుతున్నాను. వాస్తవంగా కరువు మండలాలను సాధారణంగా అక్టోబర్ 4,5 తేదీల్లో ప్రకటిస్తుంటారు. అయితే అక్టోబర్ 27న 196 మండలాల్ని ప్రకటించారు. రెండోసారి నవంబర్ 21 న 163 మండలాల్ని ప్రకటించారు. వాస్తవానికి నవంబర్ 17, 18, 19 తేదీల్లో వరదలు వచ్చాయి. అయితే తర్వాత ప్రకటన వచ్చింది. అంటే అక్టోబర్ మొదటి వారంలో చేయాల్సింది పోయి నవంబర్ 21 న కరువు మండలాల ప్రకటన చేశారు. అటువంటప్పుడుకేంద్రం నుంచి సాయం ఎలా అందుతుంది అని అర్థం చేసుకోవాలి. దీంతో మనం కేంద్రాన్ని రూ. 2,343 కోట్ల సాయం కావాలని అడిగితే రూ. 433 కోట్లు మొదటివిడతగా, రూ. 280 కోట్లు రెండో విడతగా మాత్రం ఇచ్చారు. అంటే మూడోవంతు మాత్రమే సాయం చేసినట్లు అర్థం అవుతోంది. ఒక వైపు కరువు తాండవిస్తుంటే సకాలంలో నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. అటు రైతులకు 2015..16 లో ఇన్ పుట్ సబ్సిడీ అందనేలేదు. గ్రామీణ నీటి సరఫరా పథకంలో కేటాయింపులు అరకొరగా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లాకు స్వల్పంగా ఇచ్చారు. మా పులివెందుల నియోజక వర్గం లో నీటి సరఫరా పనులు చేసే సిబ్బందికి 8 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదు. ఇదీ పరిస్థితి. వివిధజిల్లాలకు స్వల్పంగా కేటాయింపులు జరిగాయి. దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నాం ** అని వైఎస్ జగన్ ప్రకటించారు. ఆయన నాయకత్వంలో వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు.