కౌలు రైతుల రుణమాఫీ అంశాన్ని లేవనెత్తిన వైఎస్ జగన్

హైదరాబాద్) శాసనసభ సమావేశాల ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో రుణమాఫీ అంశం మీద
ప్రశ్నలు వెలువడ్డాయి. ఈ దశలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జోక్యం చేసుకొన్నారు. కౌలు
రైతులకు సైత రుణాలు మాఫీ చేసినట్లు వ్యవసాయ మంత్రి చెప్పారని, కానీ దీని మీద
స్పష్టత లేదని అన్నారు. కౌలు రైతులకు చాలా తక్కువ మందికి రుణాలు ఇచ్చినట్లు
తెలుస్తోందని చెప్పారు. మొత్తం కౌలు రైతులు అందరికీ మాఫీ చేశారా అని
అడగదలచుకొన్నానని వైఎస్ జగన్ చెప్పారు.

దీని మీద వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇచ్చిన సమాధానం పొడిపొడిగా
సాగింది. మరోసారి క్లారిఫికేషన్ అడిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. అసలు మొత్తం
ఎంత మందికి కార్డులు ఇచ్చారని సూటిగా ప్రశ్నించారు. 16 లక్షల 25 వేల మంది కౌలు
రైతులు ఉన్నారని చెబుతున్నారని, అంతమందికి కార్డులు ఉన్నాయా లేదా అని స్పష్టం
చేయాలని నిలదీశారు.

 అప్పుడు అసలు విషయం బయట పడింది. కేవలం 5 లక్షల 75వేల మందికి మాత్రమే కార్డులు ఉన్నాయని, మిగిలిన
వారికి కార్డులు లేనే లేవని, లోపాయికారీగా చేసుకొంటున్నారని చెప్పి వ్యవసాయ మంత్రి
తప్పించుకొన్నారు. 

Back to Top