నిరుపేద క్రీడాకారులు చంద్రబాబుకు కనిపించరా?

మూడుసార్లు నేషనల్స్‌ ఆడినా తగిన గౌరవం లేదు
వైయస్‌ జగన్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్న జిమ్నాస్టిక్‌ క్రీడాకారిని
పావనికి ఉద్యోగం ఇస్తానని జననేత హామీ
తూర్పుగోదావరి: మూడు సార్లు జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొన్నా.. తనను చంద్రబాబు సర్కార్‌ పట్టించుకోవడం లేదని జిమ్నాస్టిక్‌ క్రీడాకారిణి పావని ఆవేదన వ్యక్తం చేసింది. నిరుపేద కుటుంబంలో జన్మించిన తాను క్రీడలపై ఉన్న మక్కువతో జాతీయ స్థాయికి ఎదిగానని, అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కన్నీరు పెట్టుకుంది. కాకినాడలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిమ్నాస్టిక్‌ క్రీడాకారిణి పావని కలిసింది. ఈ మేరకు తమ సమస్యలను జననేతకు వివరించింది. మూడు సార్లు నేషనల్స్‌ ఆడాను.. ఇప్పటి వరకు తనకు ప్రభుత్వం జాబ్‌ ఇవ్వలేదు. క్రీడాకారులను మోసం చేయడం తగదన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తనకు జాబ్‌ ఇవ్వాలని కోరానని, ప్రభుత్వంలోకి రాగానే ప్రతిభ గల క్రీడాకారులందరికీ జాబ్‌ ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. మా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది.. జగనన్న నాకు జాబ్‌ ఇస్తే మా అమ్మానాన్నలను సంతోషంగా చూసుకుంటానని పావని అన్నారు. 
Back to Top