ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయిన వైఎస్ జ‌గ‌న్*బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తూ ఆద‌ర్శ‌నీయంగా నిలిచిన నేత‌
*నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో జ‌న నేత‌
*ఎమ్మెల్యేగా ఎప్పటిక‌ప్పుడు నియోజ‌క వ‌ర్గ స‌మీక్ష‌లు

పులివెందుల‌) ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మూడు రోజుల పాటు పులివెందుల‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం పులివెందుల నియోజ‌క వ‌ర్గానికి ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. పార్టీ వ్య‌వ‌హారాలు, ప్ర‌జా పోరాటాలు నిరంత‌రాయంగా సాగిస్తూనే క్ర‌మం త‌ప్పకుండా నియోజ‌క వ‌ర్గ ప్ర‌గ‌తిని సమీక్షించటం ఆయ‌న‌కు అల‌వాటు. అందులో భాగంగానే వైఎస్ జ‌గ‌న్ మూడు రోజుల పాటు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. 

రైతుల‌కు ధైర్యం
ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ రోడ్ మార్గంలో బెంగ‌ళూరు నుంచి పులివెందుల కు చేరుకొన్నారు. మార్గ మ‌ధ్య‌లో ఆయ‌న అనంత‌పురం జిల్లా గోరంట్ల మండ‌లం బీద‌రెడ్డి ప‌ల్లి ద‌గ్గ‌ర ఎండిన వేరుశ‌న‌గ పంట‌ను ప‌రిశీలించారు. రైతుల‌తో పంట ప‌రిస్థితిగ‌తుల గురించి మాట్లాడారు. అష్ట క‌ష్టాలు ప‌డి వేరు శ‌న‌గ పంట‌ను సాగు చేస్తున్నామ‌ని రైతులు త‌మ గోడును వెళ్ల‌బోసుకొన్నారు. వాన‌లు లేక పంట‌లు ఎండిపోతున్నాయ‌ని ఆవేద‌న చెందారు. పంట న‌ష్టం లేకుండా చ‌ర్య‌లు తీసుకొందామంటే అప్పు పుట్ట‌డం లేద‌ని వాపోయారు. రుణ మాఫీ అంటూ ప్ర‌భుత్వం త‌మ‌ను మోసం చేసిందని ఆవేద‌న వ్యక్తం చేశారు. రైతుల‌తో మాట్లాడుతూ వైఎస్ జ‌గ‌న్ .. ధైర్యం చెప్పారు. అనంత‌రం ఆయ‌న పులివెందుల చేరుకొన్నారు. స్థానికుల‌తో మ‌మేకం అయ్యారు.

మంగ‌ళ‌, బుధ వారాల్లో నియోజ‌క వ‌ర్గానికే ప‌రిమితం
మంగ‌ళ వారం నాడు వైఎస్‌ జ‌గ‌న్ పులివెందుల నియోజ‌క వ‌ర్గ ప‌నుల్ని స‌మీక్షిస్తారు. ఉద‌యం సింహాద్రిపురం మండ‌లం బ‌ల‌ప‌నూరు కు చేరుకొంటారు. ఇటీవ‌ల అనారోగ్యంతో మ‌ర‌ణించిన బ‌ల‌ప‌నూరు స‌ర్పంచ్ స‌ర‌స్వ‌త‌మ్మ కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తారు. అనంత‌రం సింహాద్రిపురం మండ‌లం లో ఎండిన వేరుసెన‌గ‌, ప‌త్తి పంట‌ల‌ను అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలిస్తారు. మ‌ద్యాహ్నం త‌ర్వాత పులివెందుల ఆర్ అండ్ బీ గెస్టు హౌజ్ లో పీబీసీ కి నీటి కేటాయింపుల‌పై స‌మీక్ష జ‌రుపుతారు. మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్, ఇంత‌ర అధికారుల‌తో చ‌ర్చిస్తారు. బుధ‌వారం నాడు క్యాంపు కార్యాల‌యంలో స్థానికుల‌కు అందుబాటులో ఉంటారు. మ‌ధ్యాహ్నం వీజే ఫంక్ష‌న్ హాల్ లో వైఎస్సార్ సీపీ నాయ‌కుడు రాయ‌లాపురం భాస్క‌ర్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థానికి హాజ‌రు అవుతారు.

నియోజ‌క వ‌ర్గానికి త‌గిన ప్రాధాన్యం 
 ప్ర‌తిప‌క్ష నేత గా రాష్ట్ర ప్ర‌జ‌ల అందరి త‌ర‌పున పోరాడ‌టం, పార్టీ అధ్య‌క్షుడుగా  పార్టీ క్యాడ‌ర్ ను స‌మాయ‌త్త ప‌ర‌చుకొ్ంటూనే వైఎస్ జ‌గ‌న్ నియోజ‌క వ‌ర్గానికి త‌గినంత స‌మ‌యం కేటాయిస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు నియోజ‌క వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌టం, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌టం చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఈ సారి పులివెందుల ప‌ర్య‌ట‌న‌లో కూడా క్యాంపు కార్యాలయంలో ఉండి ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రించి, ప‌రిష్క‌రించేందుకు షెడ్యూల్ చేసుకొన్నారు.  
------------

Back to Top