జగనన్నే ఈ రాష్ట్రానికి దిక్కు

చివరకు మరుగుదొడ్లలో కూడా టీడీపీ అవినీతి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

చిత్తూరు: చంద్రబాబు పాలనలో దిగజారిపోతున్న రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను కాపాడేందుకు మీరే దిక్కన్నా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా దామరచెరువు వద్ద వైయస్‌ జగన్‌ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రచ్చబండ సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాత్రనక పగలనక మండుటెండలో నడుస్తూ ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న యోధుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. అన్న మేమంతా నీవెంటే .. నీతోనే ఉంటాం.. రాజన్న పాలన వచ్చే వరకు వెన్నుచూపకుండా నడుస్తాం అని నియోజకవర్గ ప్రజల తరుపున చెవిరెడ్డి వైయస్‌ జగన్‌కు మాటిచ్చారు. రాష్ట్ర సర్వసంపదను దోచుకుతింటున్న చంద్రబాబు పుట్టిన నియోజకవర్గంలో ప్రజలు జననేతకు బ్రహ్మారథం పడుతున్నారన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో రాజన్న ఫొటో పెట్టుకొని జగనన్న ఏరు చెప్పుకొని తలపండిన రాజకీయ నేతలను ఓడించానని చెప్పారు. ఈ రోజు చెవిరెడ్డి అంటే వైయస్‌ఆర్‌ కుటుంబ సభ్యుడిగా ప్రజలు భావిస్తున్నారన్నారు. అదే నాకు కొండంత ఆస్తిని చెప్పారు. శత్రువు కూడా మేలు చేయాలనే మీ నుంచి నేర్చుకున్నానని, అదే స్ఫూర్తితో చంద్రబాబు పుట్టిన ఊరు నారావారిపల్లెకు సీసీ రోడ్లు వేయించానని చెప్పారు. 

రాష్ట్ర ప్రతిష్టను కాపాడాల్సింది మీరే.. అన్నా..

చంద్రబాబు ప్రభుత్వ అవినీతి మట్టి, ఇసుక, రాజధాని కాదు.. చివరకు మరుగుదొడ్లలో కూడా జరుగుతుందని చెవిరెడ్డి మండిపడ్డారు. పాకాల మండలంలో 100 మంది మరుగుదొడ్లకు దరఖాస్తు చేసుకుంటే 200ల మరుగుదొడ్లు మంజూరు చేసినట్లుగా చూపించి డబ్బులు నొక్కేశారన్నారు. అవినీతికి పాల్పడ్డారని కలెక్టర్‌ ముందు రిపోర్టు పెడితే.. అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టి ఎస్టీ ఎంపీడీఓను సస్పెండ్‌ చేశారని మండిపడ్డారు. ఈ పరిస్థితులు ఇంకా కొనసాగాల్సిందేనా అని చెవిరెడ్డి ప్రశ్నించారు. ఈ చెడుపై జగనన్న పోరాటం చేయాల్సిందేనని, రాష్ట్ర ప్రతిష్టను కాపాడాల్సిందేనని, మీరు ఈ రాష్ట్రానికి దిక్కన్నారు. 
 
Back to Top