ధైర్యంగా ఉండండి అండగా ఉంటా
– నాలుగు విడతులుగా మీ రుణాలన్నీ మాఫీ చేస్తా
– మీ పిల్లలను ధైర్యంగా బడికి పంపండి 
– వారి చదువుకు, ఉండటానికి, తినడానికి అంతా నేనే భరిస్తా
– ఐదేళ్లలో మద్యపాన నిషేధం చేసి తీరుతాం
– హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే ఓట్లడుగుతాం
 
క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌హిళ‌ల‌కు భ‌రోసా క‌ల్పించారు. ధైర్యంగా ఉండండి..మీ అంద‌రికి అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా 13వ రోజు బ‌న‌గాన‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గంలోని హుస్సెనాపురంలో ఏర్పాటు చేసిన మ‌హిళా స‌ద‌స్సులో వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు. నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో మ‌హిళ‌లు మోస‌పోయార‌ని, ఏడాదిలో మ‌న ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, మీ పిల్ల‌ల‌ను నేను చ‌ద‌విస్తాన‌ని జ‌న‌నేత హామీ ఇచ్చారు. అలాగే న‌వ‌ర‌త్నాల్లో మ‌హిళ‌ల‌కు అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఈ సందర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు. ఆయ‌న ఏమ‌న్నారంటే..వైయ‌స్ జ‌గ‌న్ మాట‌ల్లోనే..– ప్రజా సంకల్ప యాత్రకు సంఘాభావం తెలపడానకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. 
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఎన్నో బాధలు పడ్డా. ఎన్నో విధాలుగా మోసపోయం. 
– ఈ నాలుగేళ్ల బాబు పాలనలో మన కుటుంబాలకు ఏదైనా మంచి జరిగిందా అని ఆత్మపరిశీలన చేసుకోండి.
– ఎన్నికలకు ముందు ఏంచెప్పారు.. నాలుగేళ్లలో ఏం చేశారో గుర్తుకు తెచ్చుకోండి
– మోసం చేసిన నాయకులను ఏం చేయాలేమో.. అలాంటి వారు పదవిలో కొనసాగడం ధర్మమేనా.
– నాడు 2014కి ముందు చంద్రబాబు ఏం చెప్పాడో గుర్తుకు తెచ్చుకోండి
బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. 
– రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేయాలంటే బాబు రావాలన్నాడు. 
– నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా.. బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం బయటకొచ్చిందా.. 
– పొదుపు సంఘాల్లో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా .. అంటే అదీ లేదు
– గతంలో జీరో వడ్డీకే మహిళలకు రుణాలు వచ్చేవి. దానికోసం  ప్రభుత్వం బ్యాంకులకు వెయ్యి కోట్లు కట్టాలి. కానీ చంద్రబాబు ఇప్పటికే 1400 కోట్లు బ్యాంకులకు బాకీ పడ్డాడు. ఈ ఎనిమిది నెలలకు మరో 800 కోట్లు ఇవ్వలేదు. మొత్తం మీద 2200 కోట్లు మహిళలకు ఇవ్వకుండా మోసం చేశాడు. 
– ఇలాంటి ప్రభుత్వానికి కొనసాగే హక్కుందా 
– ఎన్నికలకు ముందు వచ్చీ రాగానే బెల్టు షాపులు రద్దు చేస్తామని చెప్పాడు. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు మద్యం ఏరులై పారుతోంది. ఇలాంటి బాబు పాలన మనకు అవసరమా. 
– మందు కావాలని ఫోన్‌ కొడితే ఇంటికే వచ్చే పరిస్థితి కల్పించాడు చంద్రబాబు. 
– మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ తీరుతాయి. 
– నిరభ్యంతరంగా మీ పిల్లలను బడికి పంపండి. సంవత్సరానికి 15 వేలు నేను జమ చేస్తా. 
– ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు రావడం లేదు. 30 వేలు ఉండే ఫీజులను 70 నుంచి లక్ష రూపాయాలకు పెంచాడు.
మన ప్రభుత్వం వస్తే ఫీజు ఎంతున్నా మొత్తం నేనే ఇచ్చి చదివిస్తా. 
ఫీజుల మాత్రమే కాదు. ఉండటానికి తినడానికి కూడా అయ్యే ఖర్చును నేనే భరిస్తా. 
– మీ పిల్లల చదువుల భారం మీ కుటుంబంపై పడకుండా మొత్తం నేను చూసుకుంటా. అంతా నేనే భరిస్తా. 
– అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్‌ వెయ్యి నుంచి రెండు వేలకు పెంచుతా.
– పింఛన్‌ వయసు కూడా 45 సంవత్సరాలకే తగ్గిస్తా. 
– నాన్న హయాంలో మాకు ఇళ్లు వచ్చాయి. కానీ నేడు మాకు ఇళ్లు రావడం లేదు అని పాదయాత్రలో అక్కచెల్లెళ్లు బాధ పడుతున్నారు. చంద్రబాబు పాలన చూశారు. నాన్నగారి పాలన చూశారు. జనం కన్నీళ్లు తుడిచిన నాన్నగారి పాలన తిరిగి తీసుకొస్తాం. 
అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే బాధ్యత నాది. 
– మీకు పింఛన్, రేషన్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏది కావాలన్నా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. 
ప్రతి ఊరిలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి మీ ఊరి నుంచి ఉద్యోగులను నియమిస్తాం. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లోనే మీ సమస్యలు పరిష్కరిస్తాం.
– డ్వాక్రా మహిళలు అప్పులు ఎంతున్నా భయపడాల్సిన పనిలేదు. అధికారంలోకి రాగానే నాలుగు విడతలుగా మీ అప్పులు ఎంతైతే ఉన్నాయో అన్నీ మాఫీ చేస్తా.
– ఆ డబ్బులు కూడా మీ చేతికే ఇస్తాం. 
– మీకు సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వాల్సిన విధంగా బ్యాంకులకు మేం డబ్బులు కడతాం. 
– మనందరం మద్య నిషేధానికి వ్యతిరేకమే కదా. వైయస్‌ఆర్‌సీపీ పాలన ఐదేళ్లు ముగిసేలోగా మద్య పానం నిషేధం అమలు చేసి తీరుతాం. 
– హామీలు అమలు చేసిన తర్వాతే మిమ్మల్ని ఓట్లడుగుతాం. 
– మీకు అన్యాయం చేస్తే మేమొచ్చి రిపేర్‌ చేస్తాం. 

 ఉచితంగా కరెంటు ఇస్తాం: వైయస్‌ జగన్‌
పేదలకు 200 యూనిట్ల వరకు ఇబ్బందులు లేకుండా కరెంటు ఉచితంగా ఇస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన మహిళా సదస్సులో వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..మీరు సెల్‌ ఫోన్‌ వాడినా, టీవీ చూసినా, ఫ్యాన్‌ వేసుకున్నా మీ కరెంటు 150 యూనిట్లు ఖర్చు అవుతుందని, కానీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇస్తానని జననేత హామీ ఇచ్చారు. 
 


Back to Top