జగన్‌ అనే నేను..హామీ ఇస్తున్నాను


– తునిలో అభివృద్ధి కాదు..అవినీతి పరుగెడుతుంది
– తాగడానికి మంచినీరు కరువు
– డ్రైనేజీల భూములను టీడీపీ నాయకులు ఆక్రమించారు
– ఇసుక, మట్టి, మరుగుదొడ్లు, గుడి భూములు కూడా వదలడం లేదు
– కాకినాడ సెజ్‌ భూములు వెనక్కి ఇవ్వండి బాబూ
– బాబు బినామీ కంపెనీ దివీస్‌
– నారాయణ, చైతన్య అనే బినామీ స్కూళ్లను బాబు నడుపుతున్నారు
– జాబు రాకపోతే నిరుద్యోగభృతి ఇస్తామన్నారు
– నిరుద్యోగ భృతి కింద బాబు ప్రతి ఇంటికి లక్ష రూపాయల బాకీ
– అధికారంలోకి రాగానే స్కూల్, కాలేజీ ఫీజులు తగ్గిస్తాం
– మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా నేను చదివిస్తా
– హాస్టల్‌ ఖర్చులకు ప్రతి ఏటా రూ.20 వేలు  ఇస్తాం
– చిన్న పిల్లలను బడికి పంపిస్తే తల్లి ఖాతాలో రూ.15 జమా చేస్తాం

తూర్పు గోదావరి: విద్యార్థులకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భరోసా కల్పించారు. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..ఎన్ని లక్షలు ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో అవినీతి, అరాచకాలు, అబద్ధాలు, మోసాలు చూశామని, ఇలాంటి పరిస్థితి మారుస్తానని మాట ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తుని పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

– ఈ రోజు తునిలో పాదయాత్ర జరుగుతుంటే నా వద్దకు వచ్చిన ఈ నియోజకవర్గ ప్రజలు అన్న మాటలు ఏంటో తెలుసా? అన్నా మా నియోజకవర్గాన్నికి ఓ ప్రత్యేకత ఉందన్నారు. 30 ఏళ్ల పాటు ఓ వ్యక్తి రాజకీయాల్లో కొనసాగారంటే సహజంగా మా నియోజకవర్గం అభివృద్ధిలో పరుగెత్తుందని అనుకుంటారు. కానీ ఇక్కడి పరిస్థితి అభివృద్ధిలో కాదు..అవినీతిలో పరుగులు తీస్తుందని చెబుతున్నారు.
– ఇదే నియోజకవర్గంలో అభివృద్ధి గురించి మాట్లాడుతూ..అన్నా..ఇవాల్టికి తాగడానికి మంచినీరు లేదని చెబుతున్నారు. అన్నా..డ్రైనేజీలో పరిస్థితి ఒక్కసారి పరిశీలించండి. డ్రైనేజీలను కూడా ఆక్రమిస్తున్నారని చెబుతున్నారు.
– ఇక్కడి ప్రజలు నాతో చెబుతూ..అన్నా..మా పక్కనే తాండవ నది కనిపిస్తుంది. ఒక్క స్పూన్‌ ఇసుక లేకుండా చేశారన్నా ఇక్కడి పాలకులు అని చెబుతున్నారు. ఇక్కడ మాత్రం సముద్రం ఇసుక, తాండవ ఇసుక రెండు కలిపి అమ్ముతున్నారు.
– ఆర్థర్‌పేట నుంచి ర్యాంపులు ఏర్పాటు చేసి రోజు వందలాది ఇసుక లారీలు తిరుగుతున్నాయి. పేరుకేమో ఇసుక ఫ్రీ అంటున్నారు. ఫ్రీగా ఇవ్వమని అడిగితే కేసులు పెడుతున్నారని చెబుతున్నారు. టీడీపీ నాయకులు దోచుకోవడానికే ఫ్రీ అని చెబుతున్నారు.
– ఇదే నియోజకవర్గంలో వంద చెరువుల్లో తాటిచెట్టు లోతులో మట్టిని తవ్వి ఒక్కో ట్రాక్టర్‌ రూ.1600 చొప్పున అమ్ముకున్నారని చెబున్నారు. లక్ష ట్రాక్టర్ల మట్టిని అమ్ముకున్నారని చెబుతున్నారు.చెరువులు తవ్వుకున్నందుకు బిల్లులు, మట్టిని అమ్ముకొని అక్రమంగా సంపాదిస్తున్నారు.
– ఆర్థిక మంత్రి ఇక్కడి నుంచి ఉన్న పరిస్థితిలో చివరికి మరుగుదొడ్డి కూడా వదలకుండా దోచేస్తున్నారని చెబుతున్నారు. అవినీతి సహించలేక పైడికోండ గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తే రూ.60 లక్షలు రికవరీ అయ్యిందని చెబుతున్నారు. 
– మా నియోజకవర్గంలో ఇసుక, మట్టి వదిలిపెట్టడం లేదు, మరుగుదొడ్డులు వదిలిపెట్టడం లేదు. చివరకు గుడి భూములు వదలిపెట్టడం లేదని చెబుతున్నారు. పి.ఆగ్రహరంలో ఉత్తరాది మఠం భూములు 450 ఎకరాలు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్నవరం ట్రస్ట్‌బోర్డు మెంబర్‌ రికార్డులు తారుమారు చేస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. 
– అన్నా..ఈ నియోజకవర్గంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇక్కడి వాడు కాబట్టి..ఏ స్థాయిలో కబ్జాలు జరుగుతున్నాయంటే..పోలీసు స్టేషన్‌కు సంబంధించిన భూములు కూడా వదలడం లేదని చెబుతున్నారు. దాతలు ఇచ్చిన భూముల పక్కన భూములు కొనుగోలు చేసి, పోలీసుల భూమిని ఆక్రమించి షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టారని చెబుతున్నారు. తుని పోలీసు స్టేషన్‌ పక్కనే ఉన్న బాతుల కోనేరును కప్పిపెట్టి ఆక్రమించుకుంటున్నారని చెబుతున్నారు. ్రడ్రైనేజీ స్థలాన్ని ఆక్రమించడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుందని చెబుతున్నారు.
– ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో చెప్పడానికి రైతులు ఇచ్చిన ఉదాహణ ఏంటో తెలుసా? పోలవరంలోని ఐదో ప్యాకేజీలోని కాల్వ తవ్వకం పనులు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి రూ.150 కోట్లతో పనులు చేపట్టారు. మిగిలిన చిన్న చిన్న పనుల కోసం రూ.50 కోట్లు అవవసరమైతే, దాన్ని రూ.200 కోట్లకు అంచనాలు పెంచి మంత్రి యనమల రామకృష్ణుడు తన వియ్యంకుడికి కట్టబెట్టారని చెప్పారు.
– కాకినాడ ఎస్‌ఈజెడ్‌ గురించి ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇక్కేడే ఏరువాక చేశారు. అప్పుడు ఒకమాట, ఇప్పుడు మరోమాట చెబుతున్నారని చెబుతున్నారు. ఏరువాకలో రైతులకు భూములు ఇస్తామని చెప్పారు. చివరకు ఆ భూములు మాకు వెనక్కి ఇవ్వకపోగా, చంద్రబాబు బినామీ కంపెనీ దివీస్‌ మందుల కంపెనీకి భూములు ఇవ్వడం లేదని మాపై కేసులు పెడుతున్నారని ఇక్కడి ప్రజలు చెబుతుంటే బాధనిపించింది. ఆ రోజు ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటేంటి. కాకినాడ ఎస్‌ఈజెడ్‌ జగన్‌ది అన్నారు. ఆ రోజు నేను బాధితులను పరామర్శించాను. ఆ రోజు ఆ భూములు నావే అన్నావు కదా? జగన్‌ అనే నేను చెబుతున్నాను..కాకినాడ ఎస్‌ఈజెడ్‌ భూములు వెనక్కి ఇచ్చేయండి చంద్రబాబు అంటే ఇవాల్టికి కూడా పట్టించుకోవడం లేదు. తన బినామీ దివీస్‌ కంపెనీకి బలవంతంగా భూములు సేకరించి కట్టబెడుతున్నారు.
– దివీస్‌ ఫార్మసిటికల్‌ కంపెనీలు రావాలని ఆశిస్తాం. కానీ ఈ కంపెనీలు రావాల్సిన చోట రావాలి. పక్కనే విశాఖలో ఫార్మాసిటి ఉంది. అక్కడే ఈ కంపెనీ వచ్చి ఉంటే అందరం ఆనందించేవారం. కానీ ఈ కంపెనీ తీసుకొచ్చే హాచరీస్‌ పక్కన ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోనే హాచరీస్‌ ఉన్న తుని. ఇటువంటి ప్రాంతంలో రొయ్యలు బతకాలంటే సముద్రం నీరు స్వచ్ఛంగా ఉండాలి. నీరు కలుషితమైతే రోయ్యలు బతుకవు. అందుకని రైతులు ఇక్కడ ఇలాంటి కంపెనీ వద్దని మొరపెట్టుకున్నారు. 65 లక్షల లీటర్ల మంచినీటిని తీసుకొని 55 లక్షల కలుషిత నీటిని సముద్రంలో కలుపుతున్నారు. తుని మున్సిపాలిటీలో రోజుకు 45 లక్షల నీరు వాడుతారు. దివీస్‌ ఫార్మసిటికల్స్‌ నుంచి 55 లక్షల కలుషిత నీరు సముద్రంలో కలుపుతున్నారు.
– కాపుల ఉద్యమం ఇదే నియోజకవర్గంలో జరిగింది. వైయస్‌ఆర్‌సీపీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. ఇవాళ 75 శాతం మంది ౖÐð యస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు. కేసులు రాజకీయ కోణంలో పెట్టారు. ఎస్సీలు, బీసీలు, ఆడవాళ్లు, వికలాంగులపై కూడా కేసులు పెట్టారని చెబుతున్నారు. ఆ రోజు చంద్రబాబు తానే కుట్రపూరితంగా ట్రైన్‌ తగులపెట్టించారు. దొంగ కేసులన్నీ కూడా ఎదుటివారిపై పెట్టారు. కేసులు ఎదుర్కొంటున్న వారికి చెబుతున్నాను. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టిన ఆ కేసులు తొలగిస్తామని హామీ ఇస్తున్నాను. దొంగ కేసులు పెట్టి వేధిస్తున్న పరిస్థితి తుని నియోజకవర్గంలో జరుగుతుందని చెబుతున్నారు.
– పక్కనే ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి ఉంది. అందులో 18 మంది డాక్టర్లకు గాను కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు అని చెబుతున్నారు. ఆర్థిక మంత్రి ఉన్న ఈ ప్రాంతంలో కనీసం డాక్టర్లను కూడా పెట్టడం లేదు అంటున్నారు. ఏ సర్జరీ జరగాలన్నా కూడా టీడీపీ నాయకులకు రూ.5 వేలు ఇవ్వాలని చెబుతున్నారు. 
– నాన్నగారు ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో ట్రామాకేర్‌ ఏర్పాటు చేశారు. మహానేత మరణం తరువాత పట్టించుకోవడం లేదంటున్నారు. 108 అంబులెన్స్‌ ఒక్కటే ఒక్కటి ఉందని చెబుతున్నారు. మేం ఫోన్‌ కొడితే డిజిల్‌ ఖర్చులు మీరిస్తేనే వస్తామంటున్నారని చెబుతుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది.
– నాన్నగారి హయాంలో దాదాపు 11 వేల ఇళ్లు కట్టించారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆ రోజు నాన్నగారు ఇచ్చిన పట్టాలు టీడీపీ నాయకులు లాక్కుంటున్నారని చెబుతున్నారు. ఒక్కో ప్లాట్‌కు రూ.45 వేలు లంచాలు గుంజుతున్నారు.
–తాగునీళ్ల గురించి ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. తాండవ రిజర్వాయర్‌ నుంచి ఆ రోజుల్లో వైయస్‌ఆర్‌ రూ.25 కోట్ల నిధులు కేటాయించారు. నాన్నగారు చనిపోయాక ఇవాల్టికి కూడా ఆ పనులు జరుగుతూనే ఉన్నాయని చెబుతున్నారు. తాండవ నది వరద వస్తే తుని , పాయకరావుపేట దెబ్బతింటాయి. 3.5 కిలోమీటర్లు కర కట్ట నిర్మిస్తామని టీడీపీ హామీ ఇచ్చి ఇంతవరకు పట్టించుకోవడం లేదు.
– తునిలో చెత్త ఎక్కడ వేయాలో డంపింగ్‌ యార్డు కూడా లేదని చెబుతున్నారు. శ్మాశానాల్లో చెత్త వేస్తున్నామని చెబుతున్నారు.
– చక్కెర కర్మాగారం 11 వేల మంది రైతులకు మేలు జరుగుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ ఫ్యాక్టరీ రూ.40 కోట్ల నష్టాల్లోకి నెట్టారని రైతులు వాపోతున్నారు. పట్టించుకునే నాథుడు లేడు.
–తాండవ సహకార చక్కెర ఫ్యాక్టరీకి ఆ రోజుల్లో నాన్నగారు ఎంతో చేశారని రైతులు చెబుతున్నారు. ఇవాళ చాలీ చాలని రేట్లు ఇస్తున్నారు. చెరుకు నరకడానికి టన్నుకు రూ.1100 ఖర్చు అవుతుందని చెబుతున్నారు. పక్క రాష్ట్రాల్లో రూ.3300 టన్నుకు ఇస్తున్నారు. మాకు మాత్రం ఎందుకన్నా ఇంత తక్కువగా ఇస్తున్నారని అడుగుతున్నారు.
– నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన చూశాం. అబద్ధాలు, మోసం, అవినీతి, అన్యాయం కనిపించాయి.  ఏ ఒ క్కరైనా సంతోషంగా ఉన్నారా? అబద్ధాలు చెప్పేవారు, మోసం చేసేవారు మీకు నాయకుడు కావాలా? 
– రైతులకు రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు. చంద్రబాబుచేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. వారికి కనీసం రుణాలు అందడం లేదు. మాఫీ చేయకపోయినా చేసేశాని చెబుతున్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. బాబు ముఖ్యమంత్రి అయిన తరువాత జాబులు వచ్చాయా? జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. చంద్రబాబు సీఎం అయి 50 నెలలు అవుతుంది. ప్రతి ఇంటికి చంద్రబాబు లక్ష రూపాయలు బాకీ పడ్డారు. ఇవాళ చంద్రబాబు ఏమంటున్నారు..ఎన్నికలకు ఆరు నెలల ముందు, నాలుగు నెలల కోసం కేవలం 10 లక్షల మందికి ఇస్తారట, అది కూడా కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తారట. అది కూడా కేవలం నాలుగు నెలలు మాత్రమేనట.
– ఈ పెద్దమనిషి పాలనలో జరుగుతున్నది ఏంటంటే. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు పాఠ్యపుస్తకాలు ఇవ్వడం లేదు. నారాయణ,శ్రీచైతన్య పేర్లతో చంద్రబాబు బినామీ స్కూళ్లను నడుపుతున్నారు. పేదవాడు ఆ స్కూళ్లకు పంపించాలంటే లక్షలు కట్టాల్సి వస్తోంది. ఏడాదికి కాలేజీ ఫీజు రూ.1.60 లక్షలు గుంజుతున్నారు. మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నత చదువులు చదివించగలరా? 
– రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జగన్‌ అనే నేను..ఇవాళ హామీ ఇస్తున్నాను. స్కూల్‌ ఫీజులు, కాలేజీ ఫీజులు తగ్గిస్తానని హామీ ఇస్తున్నాను. ఇష్టం వచ్చినట్లుగా ఈ ప్రభుత్వం దోచేస్తుంది. ప్రభుత్వ స్కూళ్లను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన పుస్తకాలు ఆగస్టు నెల వచ్చినా అందడం లేదు. నాసిరకం యూనిఫాం కూడా ఇవ్వడం లేదు. 20 వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. దగ్గరుండి చంద్రబాబు ప్రభుత్వ స్కూళ్లను మూత వేయిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం ఆయాలకు ఐదు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రభుత్వ స్కూళ్లను ఇంగ్లీష్‌ మీడియం చేస్తామని మాట ఇస్తున్నాను. ఎక్కడెక్కడ స్కూళ్లు అవవసరమో అక్కడ తెరిపిస్తాను. ఈ వ్యవస్థలో మార్పు తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను.
– రాష్ట్రంలో 32 శాతం మందికి చదువు రావడం లేదు. కారణం ఈ ఫీజులు కట్టలేక పిల్లలను బడులకు పంపించడం లేదు. ఈ పరిస్థితిని కూడా రేపు పొద్దున మార్చేస్తాను. మీ పిల్లలను బడికి పంపించండి. ఏ బడికి పంపించినా ఫర్వాలేదు. ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తానని హామీ ఇస్తున్నాను. ఆ పిల్లలు బడి బాట పట్టి ఇంజనీర్లు, డాక్టర్లు అయితేనే మన బతుకులు మారుతాయి.
– మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్‌ చదివించే పరిస్థితి ఉందా? ఫీజులు లక్షల్లో ఉన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.30 వేలు మాత్రమే ఇస్తుంది. ఇందులో కూడా గతేడాది ఫీజులు ఇ వ్వలేదని చెబుతున్నారు. మిగతా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు.  ఈ పరిస్థితి కూడా మార్చేస్తానని హామీ ఇస్తున్నాను. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి పేదవాడికి హామీ ఇస్తున్నాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి..మీ ఇష్టం, ఎన్ని లక్షలు ఖర్చైనా నేను భరిస్తాను. అంతేకాదు..హాస్టల్‌ ఖర్చులకు ప్రతి ఏడాది రూ.20 వేలు ఇస్తానని మాట ఇస్తున్నాను. చదువుకుంటున్న పిల్లలకు అన్ని విధాల తోడుగా ఉంటాను. 
– ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. ఈ వ్యవస్థలోకి విశ్వసనీయత రావాలి. నిజాయితీ అన్న పదానికి అర్థం రావాలి. ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి ప్రతి కార్యకర్త సగర్వంగా కాలర్‌ ఎగురవేసి చెప్పుకోవాలి. ఈ వ్యవస్థలో మార్పు రావాలంటే జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. మీ అందరి ఆశీస్సులు కావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది.
– చంద్రబాబు పాలనలో రాజకీయ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టింది. చంద్రబాబు లాంటి వ్యక్తిని పొరపాటున కూడా క్షమిస్తే..రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలుసా? ఎన్నికలప్పుడు చంద్రబాబు మీ వద్దకు వచ్చి మొట్టమొదట ఏం చేస్తారో తెలుసా? మీ చెవులు ఖాళీగా ఉన్నాయో లేదో చూస్తారు. ఎన్నికల ప్రణాళికలో 98 శాతం పూర్తి చేశానని చెవ్వులో క్వాలీఫ్లవర్‌ పెడతారు. ఆ తరువాత మైక్‌ తీసుకొని ఏం చేస్తారో తెలుసా? చిన్న చిన్న అబద్ధాలకు మీరు నమ్మరని తెలుసు కాబట్టి..రేపు పొద్దున చంద్రబాబు ఓటుకు వేస్తే ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్ముతార..నమ్మరని ఆయనకు బాగా తెలుసు అందుకే బొనస్‌గా ప్రతి ఇంటికి బెంజి కారు ఇస్తానంటారు. ప్రతి ఇంటికి మహిళా సాధికార మిత్రలను మీ ఇంటికి పంపిస్తారు. వారు వచ్చి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. కుదరదు..రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే..కానీ ఓటు వేసేటప్పుడు ఒక్కటే గుర్తు పెట్టుకోండి. అబద్ధాలు చెప్పేవారికి, మోసాలు చేసేవారిని బంగాళఖాతంలో కలిపేయండి. మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి. ఈ వ్యవస్థలోకి ధర్మం, నిజాయితీ, విశ్వసనీయత రావాలి. ఇది జరగాలంటే మనందరం ఒక్కటి కావాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు మీ బిడ్డ బయలుదేరాడు. ఎక్కడ ఉంటున్నానో మీ అందరికి తెలుసు. ఎవరైనా రావచ్చు..అర్జీలు ఇవ్వచ్చు. మీ బిడ్డను దీవించమని మరొక్కసారి కోరుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. 


 
Back to Top