ఏడవకు తల్లీ నేనున్నా..

విశాఖపట్నం: ఏడవకు తల్లీ నేనున్నా.. ఎంత పెద్ద చదువులైనా చదివిస్తా అని ఓ విద్యార్థిని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ ఓదర్చారు. 251వ రోజు ప్రజా సంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుంటున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఓ విద్యార్థిని కలిసింది. అన్నా చదువుకోవాలని ఉందన్నా అంటూ కన్నీరు పెట్టింది. ఆ విద్యార్థిని అక్కున చేర్చుకొని ఏడవకు తల్లీ నేనున్నా.. ఎంత పెద్ద చదవులైనా చదివిస్తా అంటూ కన్నీరు తుడిచి ధైర్యం చెప్పారు. మనసులో పెద్ద చదువులు చదవాలనే ఆశ.. ఆ ఆశకు పేదరికం అడ్డు. ప్రభుత్వం స్కాలర్‌షిపులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ల ద్వారా నైనా చేయూతనందిస్తుందనుకుంటే అవి అందనంత దూరంలో ఉన్నాయి. దీంతో చదువు కోవాలని కోరిక.. ఆ విద్యార్థిని వైయస్‌ జగన్‌ను కలిసేలా చేసింది. 
 
Back to Top