పేద‌ల‌ రాజ్యం వస్తోంది

 

– స్వాతంత్య్రం వచ్చినా దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది
– దళితులపై చంద్రబాబు వ్యాఖ్యలు ఆశ్చర్యకరం
– మా అవ్వలు దళితులనే పెళ్లి చేసుకున్నారు..వారంటే నాకెంతో ఇష్టం
– వేరే మతాన్ని కొలిస్తే తప్పా?
– దళితులను అడుగడుగునా మోసం చేసిన చంద్రబాబు
– నాలుగేళ్లుగా పట్టించుకొని వ్యక్తి మరో ఏడాదిలో ఎన్నికలొస్తున్నాయని డ్రామాలు
– వైయస్‌ రాజశేఖరరెడ్డి దళితులకు 32 లక్షల ఎకరాలు పంపిణీ చేశారు
– మనందరి ప్రభుత్వం వచ్చాక చదువుల విప్లవం తెస్తా
– 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్లు
– పేదలందరికీ పక్కా ఇల్లు
– ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం
– పదవుల్లో దళితులకు పెద్ద పీట వేస్తాం
 కృష్ణా జిల్లా: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా రాష్ట్రంలో ఇంకా వివక్ష కొనసాగుతుందని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక పేదల రాజ్యం తెస్తానని మాట ఇచ్చారు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులకు రక్షణఉండదన్నారు. దళితులు వేరే మతాన్ని ఆచరించకూడదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పెరికగూడెంలో ఏర్పాటు చేసిన ఆత్మీయసమ్మేళనం కార్యక్రమంలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ రోజు దళితులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం ఆనందంగా ఉంది. జిల్లా అంతట తిరుగుతున్నాను. అవకాశాన్ని బట్టి ఎక్కడో ఒకచోట దళిత అక్క చెల్లెమ్మలతో ఆత్మీయ సమ్మేళనం జరిగేలా చూడమని చెబుతుంటాను, కారణం ఏంటంటే..స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు పూర్తయినా కూడా మన కాలనీలు విసిరి వేసినట్లుగా ఉంటున్నాయి. నాన్నగారు ఇందిరమ్మ కాలనీలు గొప్పగా కట్టించారు. మహానేత చనిపోయిన తరువాత ఆ కాలనీలను పాలకులు పట్టించుకోవడం లేదు. ఇవాల్టికి కూడా అదే వివక్షకనిపిస్తోంది. దళితుల గురించి చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ పెద్ద మనిషికి దళితులపై ప్రేమ ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తుంది.
– దళితుల గురించి నాన్నగారు అసెంబ్లీలో అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి. మా నాన్నగారి మేనత్తలు అంటే నాకు అవ్వలు..వారంత కూడా దళితులను పెళ్లి చేసుకున్నారు. ఇవాల్టికి కూడా వారిని మామ అని పిలుస్తాను. ఇవాళ చంద్రబాబు మాటలు చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది. చంద్రబాబు సీఎం స్థానంలో ఉంటూ దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు. నాన్నగారు ఎక్కడ? చంద్రబాబు ఎక్కడా?నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఎంచి చూడగా మనుజులందునా మంచి చెడులు రెండే కులములు. మంచి అన్నది మాల అయితే నేను మాలనైతా అని గురజాడ అప్పారావు వందేళ్ల క్రితం అన్నారు. నేను మైక్‌ పట్టుకొని మాట్లాడే సమయంలో కచ్చితంగా అనే మాట ఏంటో తెలుసా? దళితులు ఏసు ప్రభువునో, క్రిస్టియన్‌ మతాన్ని ఎంచుకుంటే వారికి ఎస్సీ సర్టిఫికెట్‌ ఇవ్వరట. వేరే మతాన్ని కొలిస్తే తప్పా? ఇవాల్టికి కూడా మంచి చెడులకు తేడా కనిపించడం లేదు. వారి బతుకులు మారడం లేదు. వివక్ష చూపుతున్నారు. ఇవాల్టికి కూడా పోరాటం చేయాల్సి వస్తోందంటే భారత దేశం సిగ్గుతో తలదించుకోవాలి. దేవుడు దయతలిస్తే..ఈ వ్యవస్థలో మార్పు తెస్తాను. 
– నాలుగేళ్ల చంద్రబాబు పాలనను మీరంతా చూశారు. టీడీపీ మేనిఫెస్టోలో ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారు. తనకన్న పెద్ద దళితుడు లేడు అని ఫోజులు కొడతారు. అందరిని కన్న పెద్ద దళితుడిని నేనే అని ఫోటోకు ఫోజులు ఇస్తారు. హాస్టల్‌ మెస్‌ చార్జీలు ఎప్పటికప్పుడు సవరిస్తామన్నారు. మెస్‌చార్జీలు పెరిగాయా? ఉన్న హాస్టళ్లను మూత వేయించే కార్యక్రమాన్ని చేపట్టారు. దాదాపు 670 హాస్టళ్లను మూసి వేయించారు. ఇవాళ చంద్రబాబు ఒక్క రూపాయి కూడా మెస్‌ చార్జీలు పెంచగపోగా గొప్పగా మాట్లాడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ను వందశాతం అమలు చేస్తామని చెప్పారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి ఈనాడులో 19.11.2017లో ప్రచురితమైన కథనం చూడండి. కేటాయింపులేంతా? వ్యయమేంత అని రాశారు. రూ.4700 కేటాయింపులైతే ఖర్చు చేసింది రూ.2300..అంటే 50 శాతం మాత్రమే. ఇలా మోసం చేయడం చంద్రబాబుకు ధర్మమేనా? మేనిఫెస్టోలో మాత్రం ఎస్సీ, ఎస్టీ సబ్‌ అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. అతిక్రమించే వారిని శిక్షిస్తామన్నారు. అంటే చంద్రబాబును జైలులో పెట్టాలి. 
– బాక్‌ల్యాగ్‌ పోస్టులను ఆరు నెలల్లోనే భర్తీ చేస్తానని ఎన్నికల ప్రణాళికలో చెప్పారు. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. భూమి లేని షెడ్యూల్‌ కులాలకు భూమి కొనుగోలు పథకం అన్నారు. ఒక్క ఎకరా అయినా ఎవరికైనా కొనుగోలు చేయించారా?. నాన్నగారి హయాంలో అక్షరాల 32 లక్షల ఎకరాలు పంపిణీ చేశారు. చంద్రబాబు హయాంలో పంపిణీ కథ దేవుడెరుగు..అసైన్డ్‌భూమి కనిపిస్తే చాలు వాళ్ల అత్తగారి సొత్తు అన్నట్లు లాక్కుంటున్నారు. షెడ్యుల్‌ కులాలకు చెందిన ఔత్సాహికులకు పరిశ్రమల స్థాపనకు రూ.5 కోట్ల వరకు రుణ సౌకర్యం అన్నారు. ఒ క్కరికైనా ఇచ్చారా? . నాలుగేళ్ల పాటు ఎవరిని పట్టించుకోలేదు. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయని దళిత తేజం అంటూ బయలు దేరారు. ఒక్కసారి గమనించండి. 
– నాలుగేళ్ల ఈ పాలనను చూశారు కాబట్టి ఎక్కడైనా మంచి కనిపించిందా? . టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులకు ఇబ్బందులు మొదలవుతున్నాయి. కారంచెడు నుంచి నేటి వరకు ఇవే ఇబ్బందులు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో 2016 ఆగస్టులో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దళితులను చెట్టుకు కట్టి కొట్టారు. నేను వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించాను. 2017 జులైలో ప్రకాశం జిల్లా దేవరపల్లిలో 70 ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూమిని ఆక్రమించుకున్నారు. నీరు–చెట్టు కింద ఈ భూములు టీడీపీ ఎమ్మెల్యే లాక్కున్నారు. వైయస్‌ఆర్‌సీపీ నాయకులంతా దేవరపల్లికి వెళ్లడంతో తప్పని పరిస్థితుల్లో ఆ భూములు వదిలిపెట్టారు. విశాఖలోని .జె్రరిపోతుల పాలంలో టీడీపీ నాయకులు ఓ మహిళను వివస్త్ర్రను చేసి కొట్టారు. ఆమె భూమిని ఆక్రమించుకునేందుకు పశువుల మాదిరిగా టీడీపీ నాయకులు వెళ్లి దారుణంగా దాడి చేశారు. ఇంతవరకు ఎవరిమీదా చర్యలు తీసుకోలేదు. 2018 జనవరిలో గుంటూరు జిల్లా గొట్టిపాడులో టీడీపీ నాయకులు దళితులపై దాడి చేశారు. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం నక్కల దిన్నెలో పారిశుద్ధ్య పనులు చేయలేదని గ్రామ బహిష్కరణ చేశారు. మంచినీరు కూడా ఇవ్వకుండా నిలిపివేశారు.
– దళితులపై ఈ రకంగా ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే..ఒక నాయకుడి నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయో కింది క్యాడర్‌లో కూడా అలాంటి మాటలే ఉంటాయి. నాయకుడిని బట్టి పార్టీ ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే ఆయన నోటి నుంచి ఎస్సీ కులంలో ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అన్నారు. కిందిగ్రామస్థాయిలోని నాయకులు దళితులను ఏమాత్రం పట్టించుకుంటారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడం మంచిదేనా? కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు ఏమన్నారో తెలుసా? తెలివి ఈయన అత్తగారి సొత్తా? ఎస్సీలకు తెలివి ఉండదని మాట్లాడారు. జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అయితే దళితులు శుభ్రంగా ఉండరని అంటారు. నా క్యాబినెట్‌లో ఇలాంటి వ్యక్తి ఉంటే వెంటనే సస్పెండ్‌ చేసేవాడిని. పేదవాడిని ఆప్యాయంగా పలకరించని వారు ముఖ్యమంత్రిగా అనర్హులు. అలాంటి సంకేతం ఇవ్వని చంద్రబాబు సీఎం పదవికి సరిపోడు. 
– ఇదే పెద్ద మనిషి నాలుగేళ్ల పాలనలో కరెంటు బిల్లులు ఎంత వచ్చేవి. గతంలో కరెంటు బిల్లులు ఎస్సీలకు అసలు వచ్చేవి కావు. ఇప్పుడు రూ.500, రూ.1000, రూ.2000 చొప్పున బిల్లులు వస్తున్నాయి. పైగా కరెంటోళ్లు ఇళ్లలోకి వచ్చి ఇష్టారాజ్యంగా జరిమానా విధిస్తున్నారు. 
– నాన్నగారి హయాంలో దేశంతో ఆయన పోటి పడి రాష్ట్రంలో 48 లక్షల పక్కా ఇల్లు కట్టించారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. ఒక్క ఎకరా కూడా భూ పంపిణీ చేయకపోగా, మన భూములపై ఎక్కడ పడుతాయో అని భయపడుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఉపకార వేతనాల గురించి ఈ ప్రభుత్వ తీరును ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యాచారాల గురించి మీ అందరికి తెలిసిందే. దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్నామంటే ఏ సీఎం అయినా తలదించుకోవాలి. 
– ఇటువంటి దారుణమైన పాలన చూశాం కాబట్టి. రేపు పొద్దున ఈ ప్రభుత్వం పోయి మీ అందరి దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంచి పరిపాలన ఇవ్వడం కోసం మనం ఏం చేస్తే బాగుటుందో తెలుసుకునేందుకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశాం. ఇదివరకే నేను కొన్ని చెప్పాను. 
– మనం అధికారంలోకి వచ్చిన తరువాత నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే..జగన్‌ నాన్నగారి కొడుకుగా రెండు అడుగులు ముందుకు వేస్తాను. మన చిట్టి పిల్లలు ఉన్నారు కదా? వీరు బడికి వెళ్లి రేపు పొద్దున డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి. అప్పుడే మన బతుకులు మారుతాయి. పేదరికం నుంచి అడుగులు ముందుకు వేయాలంటే ఈ చిట్టి పిల్లలు బాగా చదవాలి. వీరు చదివేందుకు పేదరికం అడ్డురాకూడదు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి తల్లి తన బిడ్డను ఏ బడికి పంపించినా పర్వాలేదు. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తాం. ఇలా ఇవ్వడం వల్ల ఆ తల్లికి ప్రోత్సాహకంగా ఉంటుంది. చదివించే స్థోమత లేకపోవడంతో మన రాష్ట్రంలో 32 శాతం మందికి చదువు రావడం లేదు. ఈ పరిస్థితి మార్చేందుకు అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తాం.
– పిల్లలను గొప్ప గొప్ప చదువులు చదివించే పరిస్థితిలో ఉన్నామా? ఈ ప్రభుత్వం ముష్టి వేసినట్లు రూ.35 లక్షలు ఇస్తున్నారు. అది ఎప్పుడిస్తారో తెలియదు. ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి. ప్రతి ఏడాది పేదవారి చదువుల కోసం తల్లిదండ్రులు లక్షల రూపాయలు అప్పులు చేసి చదివించే పరిస్థితిలో ఉన్నామా;ఇలాంటి పరిస్థితులు పూర్తిగా మార్చుతాం. చదువుల విప్లవం తీసుకువస్తాం. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి...ఎన్ని లక్షలు ఖర్చైనా నేనే భరిస్తాను. అంతేకాదు మీ పిల్లల హాస్టల్‌ ఖర్చులకు సంవత్సరానికి రూ.20 వేలు ఇస్తామని మాట ఇస్తున్నాను. దీని వల్ల ఆ తల్లిదండ్రులకు భారం ఉండదు. 
– నవరత్నాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ గురించి ఏం చేస్తామో చెప్పాను. ఆరోగ్యశ్రీలో మార్పులు చేస్తాం. ఎన్ని లక్షలు ఖర్చైనా ఉచితంగా వైద్యం అందిస్తాం. రూ.1000 దాటితే దాన్ని ఆరోగ్యశ్రీకిందకు తీసుకొస్తాం.
– పింఛన్లు ఇవాళ రూ.1000 ఇస్తున్నారు. ఇది ఏమాత్రం సరిపోదు. మనందరి ప్రభుత్వం వచ్చాక పింఛన్‌ రూ.2 వేలు చేస్తాం. పేదవారికి అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు వారం రోజులు పనులకు వెళ్లకపోతే పస్తులుండాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితులు మార్చుతూ పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గిస్తాం. దానివల్ల రూ.2 వేలు వస్తే ఆ అక్కకు ఆసరాగా ఉంటుంది.
– మనం చేసే కార్యక్రమలు ఎస్సీలు, ఎస్టీల నుంచి మొదలుపెట్టి బీసీలు, మైనారిటీల వరకు మేలు చేస్తాం. ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి భూములు ఇవ్వాలన్నదే నా ఆశయం. ఒట్టి భూములిస్తేనే బతకలేరు. ఆవులు, గేదేలు కూడా ఇస్తాం. పాడి పరిశ్రమను ప్రోత్సహించి తోడుగా ఉంటాం. 
– నాలుగేళ్లు చంద్రబాబుకు దళితులు గుర్తుకు రాలేదు. దళిత తేజం అంటున్నాడు. ఎస్సీ ఆడబిడ్డకు పెళ్లి అయితే రూ.50 వేలు ఇస్తాడట. మనం చెప్పిన తరువాత ఈ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి హోదాలో నేను ఆడబిడ్డకు పెళ్లి కానుకగా లక్ష ఇస్తామని మాట ఇస్తున్నాను. మాల, మాదిగ, రెళ్లి అని ఎస్సీ కులాలు చాలా ఉన్నాయి. మీ అందరికి తోడుగా ఉంటాను. ఐక్యమత్యమే మన బలం. ఎస్సీలంతా ఒక్కతాటిపై ఉండాలి. 18 శాతం జనాభా ఒక్క తాటిపై నిలబడాలి. అప్పుడు ఎవరైనా మన జోళికి రావాలంటే భయపడాలి. ఇవాళ నాయకులు విభజించు..పరిపాలించు అన్న పాలసీలో ఉన్నారు. జనాభా ప్రతిపాదికన మాలలకు, మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్‌ఏర్పాటు చేస్తానున. మిగతా కులాలకు మరో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం.
– చర్చీ, మసీద్, గుడికి ప్రతి ఒక్కరూ వెళ్లాలి. అప్పుడే మంచి చెడుల మధ్య తేడా తెలుస్తుంది. చెడు చేసే సమయంలో మన గుండె చెబుతుంది. చర్చీలు, మసీదులు, గుడిలను నిలబెట్టేందుకు  ప్రతి పంచాయతీకి రూ.10 వేలు  ఇస్తాం. అలాగే గుడికి రూ.10 వేలు, మసీదుకు రూ.10 వేల చొప్పున ఇచ్చి భక్తిభావాన్ని నెలకొల్పుతాం.
– చాలా మంది అక్కచెల్లెమ్మలు పొదుపు సంఘాల్లో ఉన్నారు. చంద్రబాబు రుణమాఫీ పేరుతో మోసం చేశారు. ఆ అక్కచెల్లెమ్మలందరికి చెబుతున్నాను. నాన్నగారు అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలని కలలు కన్నారు. సున్నా వడ్డీలకు రుణాలిచ్చి ఆదుకుంటే అది సాధ్యం. కానీ చంద్రబాబు వచ్చాక వడ్డీ డబ్బులు బ్యాంకులకు కట్టడం మానేశారు.దీంతో అక్కచెల్లెమ్మలు బ్యాంకు నోటీసులు అందుతున్నాయి. ఏ బ్యాంకు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాను. మనందరి ప్రభుత్వం వచ్చాక నాలుగు ధపాలుగా రుణాలు మాఫీ చేస్తాం. నేరుగా మీ చేతికే ఇ స్తాను. వడ్డీ లేని రుణాలు ఇచ్చి తోడుగా ఉంటాను. ఇవి కాక ఏదైనా మంచి చేయాలని మీకు అనిపిస్తే సలహాలు, సూచనలు ఇవ్వండి..సాధ్యాసాధ్యలను పరిశీలించి మేలు చేస్తాం.

 
Back to Top