స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు
– 540 ఎకరాల మునపాక అసైన్డ్‌ భూములు కొట్టేసేందుకు కుట్ర
– స్థానిక ఎమ్మెల్యే దొంగ దీక్షలు చేశారు
– నీరు–చెట్టు కింద చెరువుల తవ్వేసి మట్టి అమ్ముకుంటున్నారు
– అధికారంలోకి రాగానే ఎన్‌టీపీసీ సమస్య పరిష్కరిస్తాం
–భూదేవి చెరువు రిజర్వాయర్‌కు వైయస్‌ఆర్‌ శంకుస్థాపన
– మహానేత చనిపోయాక నిలిచిపోయిన పనులు
–  ఉద్యోగాలు లేవు..నిరుద్యోగ భృతి దక్కలేదు
– ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయి
– నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసిన టీడీపీకి హోదా గుర్తుకు రాలేదు
–అధికారంలోకి రాగానే అవ్వా,తాతలకు రూ.2 వేలు పింఛన్‌ ఇస్తాం
విశాఖ:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్ట మొదటి శాసన సభలో ఒక బిల్లుల తెస్తామని, ఉన్న పరిశ్రమలు, కట్టబోయే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులే ఇచ్చేలా బిల్లు తీసుకువస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని, నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసిన టీడీపీకి ఈ విషయం గుర్తుకు రాలేదని, ఇప్పుడు హోదా కోసం అంటూ దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఎన్‌టీపీసీ సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఈ సంరద్భంగా ఆయన ఏమన్నారంటే..  


లా యూనివర్సిటీ వైయస్‌ఆర్‌ పుణ్యమే..
ఇక్కడే పక్కనే దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ ఎప్పుడు వచ్చిందటే ఆ రోజు నాన్నగారి పుణ్యం. మన రాష్ట్రానికి లా యూనివర్సిటీ రావాలని, అది కూడా విశాఖపట్నం రావాలని, అది కూడా సబ్బవరంలో ఉండాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పట్టుపట్టి తీసుకువచ్చారు. ఇవాళ అటువంటి స్థాయి నుంచి ఈ నియోజకవర్గం గురించి చంద్రబాబు పాలన గురించి ఇక్కడ ప్రజలు ఏమంటున్నారో తెలుసా? బాబు గారు వచ్చారు..గజానికో కబ్బాకోరును తయారు చేశారని చెబుతున్నారు. రికార్డులు తారుమారు చేసి భూములు ఆక్రమించి, బినామీల పేరుతో పరిహారం కాజేస్తున్నారని ఇక్కడి నాయకుల గురించి చెప్పుకొస్తున్నారు.

పేదవాడికి రక్షణ కరువు
ఇదే నియోజకవర్గంలో దళిత మహిళను వివస్త్రను చేసిన ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో పేదవాడికి రక్షణ కరువైందని చెప్పుకొస్తున్నారు. ఇక్కడి నాయకుల గురించి ప్రజలు నా వద్దకు వచ్చి చెబుతున్నారు. ప్రతి దాంట్లోను స్కామే. ఇందులో పెద్దబాబు, చిన్నబాబు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు కమీషన్లు ముట్టుతున్నాయని చెబుతున్నారు. పెద్దబాబుకు విశాఖ ఆస్తులపై కన్నుపడిందని చెబుతున్నారు. ముదిపాకలోని 500 ఎకరాల అసైన్డ్‌భూములు కొట్టేసేందుకు ఎమ్మెల్యే ఏకంగా చిన్నబాబుతో సంబంధాలు పెట్టుకున్నారని చెబుతున్నారు. ల్యాండు పూలింగ్‌ పేరుతో అసైన్డ్‌భూములను టీడీపీ నేతలు తమ బినామీలతో కొనుగోలు చేయించి ప్రభుత్వానికి అప్పగిస్తోంది. ఆ తరువాత ఈ భూముల్లో ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నారు. ఈ స్కాంను నిరోధిస్తూ ఆందోళన చేపడితే తప్పించుకునేందుకు ఎంక్వైరీ వేశామని సాగదీస్తున్నారు.

భూములు స్వాహా..
మెడ్‌టెక్‌ కోసం 250 ఎకరాలు తీసుకున్నారు. మాజీ సైనికులకు సంబంధించిన పేదల బూములను బలవంతంగా తీసుకున్నారు. బినామీలను సృష్టించి, నకిలీ డాక్యుమెట్లు సృష్టించారు. పేదలకు దక్కాల్సిన పరిహారాన్ని కూడా ఇక్కడి టీడీపీ నాయకులు గద్దల్లా తన్నుకుపోతున్నారు.
– గు్రరంపాలెంలో ఏపీఐఐసీ భూములు సేకరించారు. ఎకరానికి రూ.25 లక్షల చొప్పుల పరిహారం ఇచ్చారు. ఇందులో కూడా దోచుకుతినే ప్రయత్నం చేశారు.
– నీరు–చెట్టు పథకం కింద పెందుర్తి పెద్ద చెరువు, తవ్వాడి పాలెం చెరువులు సహా అనేక చెరువులు తవ్వేసి మట్టిని అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు కూడా తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఏకంగా తాటిచెట్టు అంత లోతు తవ్వుతున్నారని చెబుతున్నారు. ఏకంగా రూ.40 కోట్లు దోచేశారని చెబుతున్నారు. నిజంగా వీళ్లు మనుషులేనా? లక్ష్మీపురంలో రాయుడు చెరువును ఆక్రమించి వంద కోట్ల విలువైన భూములు లాక్కునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 
–ఈ నియోజకవర్గంలోని సింహాచలం దేవస్థానం పంచగ్రామాల వద్ద ఉన్న భూ సమస్యను తీర్చుతానని ఎన్నికల్లో చంద్రబాబు ఊదరగొట్టారు. ఆయన అబద్ధాలు, మోసాలు అంటూ ఏ స్థాయిలో చేస్తారంటే. వంద రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తానని చెవ్వుల్లో పువ్వులు పెట్టారు. ఇక్కడి ఎమ్మెల్యే దొంగ దీక్షలు చేస్తారు, తన పదవికి రాజీనామా చేస్తానని చెవ్వుల్లో క్వాలీఫ్లవర్‌ పెడతారు. ఇంతటి దారుణంగా ప్రజల మనోభావాలతో ఆడుకుంటున్నారు.

పిఠాధిపతులకు ఆ బాధ్యతలు అప్పగిస్తాం..
ఇదే భూమి విషయాన్ని పరిష్కరించేందుకు చంద్రబాబు వేసిన అడుగులు ఏంటని అడుగుతున్నాను. ఇదే నియోజకవర్గంలో పిఠాధిపతులు ఉన్నారు. వాళ్లతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించమని వారికే అప్పగిస్తే సమస్య పరిష్కారం కాదా అని అడుగుతున్నాను. ఒక సమస్యను పరిష్కరించాలంటే దానికి చిత్తశుద్ధి, తాపత్రయం మనసులో ఉండాలి. చంద్రబాబుకు ఈ రెండు లేవు కాబట్టి ఈ సమస్య పరిష్కారం కావడం లేదు.
– దేవుడి దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కచ్చితంగా ఇక్కడి పిఠాధిపతులకు బాధ్యతలు అప్పగిస్తాను. వాళ్లతో కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తానని మాట ఇస్తున్నాను.
– పక్కనే ఎన్‌టీపీసీ ఉంది. ప్లకార్డులు పట్టుకొని వాళ్ల బాధలు చెప్పుకుంటున్నారు. పిట్టవారిపాలెం, మరగాసు పేట గ్రామాలను తరలిస్తామని చెప్పారు. ఎన్‌టీపీసీ కాలుష్యం వస్తుంది. ఇంతవరకు చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో వెంటనే పరిష్కరిస్తామని చెప్పి..అధికారంలోకి వచ్చిన తరువాత మరిచిపోయారు. అసలు వీరు రాజకీయాల్లో అర్హులేనా? ఈ సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తాను. ఈ గ్రామాలను షిప్ట్‌ చేసి, వారు అడిగినంత ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇస్తున్నాను.

నాన్నగారు ఓ స్వప్నం చూశారు
పరవాడలో ఫార్మాసిటీ కనిపిస్తోంది. ఇక్కడి పిల్లలకు ఉద్యోగాలు రావాలని వైయస్‌ రాజశేఖరరెడ్డి ఓ స్వప్నం చూశారు. పక్కనే ఉన్న బ్రాండెక్స్‌లో ఎంతో మందికి ఉపాధి కల్పించారు. పరవాడలో ఇప్పటికే 12 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ కలలు కన్న స్వప్నం. ఎస్‌ఈజెడ్‌లు ఉన్నాయి..కానీ ఉద్యోగాల విషయంలో యాజమాన్యాలు  ఎలా తయారయ్యారంటే..ఫ్యాక్టరీలు పెట్టడానికి మన స్థలాలు కావాలి. ఉద్యోగాలు ఇచ్చే విషయంలో మాత్రం మన పిల్లలు వీరికి గుర్తుకు రారు. రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ..మొట్ట మొదటి శాసన సభలో ఒక బిల్లుల తెస్తాం. ఉన్న పరిశ్రమలు, కట్టబోయే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు లోకల్‌ వారికే ఇవ్వాలని బిల్లు తీసుకువస్తాం. దాని వల్ల స్థానికులే ఉద్యోగాలు వస్తాయి. 

రిజర్వాయర్‌ పూర్తి చేయాలన్న ఆలోచన లేదు..
ఇక్కడికి వచ్చేటప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో అంతర్భాగమైన భూదేవి చెరువు కనిపించింది. 8 లక్షల ఎకరాలలకు సాగునీరు ఇచ్చేందుకు వైయస్‌ రాజశేఖరరెడ్డి సబ్బవరం సమీపంలోని అయ్యనపాలెంలో భూదేవి చెరువు వద్ద రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసిన ఘటన నాకు గుర్తుంది. పిల్లలను చదివించాలన్నా, పెళ్లిళ్లు చేసుకోవాలన్నా ఇక్కడి ప్రజలకు ఇబ్బందిగా ఉంది. రిజర్వాయర్‌ పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు.

రాష్ట్రంలో అన్యాయమైన పాలన
నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో అన్యాయం కనిపిస్తోంది. ఒ క్కసారి మీరందరూ గుండెలపై చేతులు వేసుకొని ఆలోచన చేయండి. మీకు ఎలాంటి నాయకుడు కావాలో ఆలోచన చేయండి, అబద్ధాలు చెప్పేవారు. మోసం చేసేవారు మీకు నాయకుడిగా కావాలా? ఇవాళ చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో వ్యవసాయం లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. సహకారంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయి. రైతులకు రుణమాఫీ లేదు. రూ.87 వేల కోట్లు మాఫీ చేస్తామన్న చంద్రబాబు రైతుల వడ్డీల్లో 4వ వంతు కూడా రాలేదు. బంగారం ఇంటికి తెస్తానన్నారు. బంగారం ఇంటికి రాలేదు కానీ, బ్యాంకుల్లోని బంగారం వడ్డీలకే సరిపోయింది. రైతులకు, పొదుపు సంఘాలకు సున్నా వడ్డీలు లేవు. పావలా వడ్డీలు మరిచిపోయారు. ఎన్నికల్లో పొదుపు సంఘాలు తానే కనిపెట్టానని చెప్పిన పెద్ద మనిషి అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు.
– ఎన్నికల సమయంలో పిల్లలను కూడా వదిలిపెట్టలేదు. జాబు రావాలాంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే  ఇంటికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఉద్యోగాలు వెల్లువలా వచ్చేవి. పరిశ్రమలు ఏర్పాటు అయ్యేవి. చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రానికి తన కేసులు, లంచాల కోసం తాకట్టు పెట్టారు. బీజేపీతో సంసారం చేసినప్పుడు చంద్రబాబుకు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్‌ గుర్తుకు రాలేదు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తరువాత మొదటి భార్య చెడ్డదని అంటున్నారు. చిలుకా, గోరింకల్లా చంద్రబాబు, బీజేపీలు గొప్పగా పొగుడుకున్నారు.  ఏ రాష్ట్రానికైనా ఇంతకన్న మంచి జరిగిందా అని 2017 జనవరిలో చంద్రబాబు బీజేపీని పొగిడారు. ఇవాళ అదే పెద్ద మనిషి ఏమంటున్నారు. పెట్రోల్‌ రేట్లు పెరిగినా కూడా మొదటి భార్యదే తప్పు అంటున్నారు. 
– పోలవరం ప్రాజెక్టు నాలుగేళ్లు అయినా కూడా పునాది గోడలు దాటడం లేదు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎలా దోచుకోవాలి అని నామినేషన్‌ పద్దతిలో సబ్‌ కాంట్రాక్టర్లుగా తనకు సంబంధించిన బినామీలను తీసుకువస్తున్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కూడా ఓ సబ్‌ కాంట్రాక్టర్‌.

బాదుడే బాదుడు..
చంద్రబాబు హయాంలో కరెంటు చార్జీల బాదుడే బాదుడు. పెట్రోలు, డీజిల్‌ ధరలు బాదుడే బాదుడు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు, స్కూల్‌ ఫీజులు, కాలేజీ ఫీజులు బాదుడే బాదుడు. 
– ప్రభుత్వ పాఠశాల్లో టీచర్ల పోస్టులు భర్తీ చేయడం లేదు. టెట్‌ 1, 2, 3 అంటున్నారు కానీ డీఎస్సీ పరీక్షలు పెట్టడం లేదు. టెట్‌ పరీక్షలకు ఫ్రిఫెయిర్‌ కావడానికి వేలకు వేలు కోచింగ్‌ సెంటర్లకు పెడుతున్నారు. రాష్ట్రం విడిపోయేనాటికి లక్ష 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటి కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకంలో ఆయాలకు ఆరు నెలలుగా జీతాలు లేవు. హైస్కూల్‌ పిల్లలకు భోజన సరుకుల బిల్లులు 8 నెలలుగా ఇవ్వడం లేదు. ఎలిమెంటరీ స్కూళ్లకు ఐదు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం నీరు గార్చుతున్నారు. మనంతకు మనమే పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపించడం మానేసి నారాయణ, చైతన్య స్కూళ్లకు పంపించే పరిస్థితి కల్పిస్తున్నారు.
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారు. ముష్టి వేసినట్లు రూ.30 వేలు ఇస్తున్నారు. ఇవి కూడా రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. ఏడాదికి రూ.70 వేలు చెల్లించాలంటే ఆ తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటున్నారు. 
– ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. పక్కనే ఉన్న కేజీహెచ్‌కు వెళ్తే ఒక బెడ్డులో  ఇద్దరు పండుకుని ఉంటారు. ఇవాళ మనకు ప్రాణాంతరకర రోగం వస్తే హైదరాబాద్‌కు వెళ్తాం. అక్కడికి వెళ్తే ఆరోగ్యశ్రీ కట్‌ అంటున్నారు. ఈయన గారి మంత్రి యనమల రామకృష్ణుడు పంటి నొప్పి వస్తే సింగపూర్‌కు తీసుకువెళ్లి రూ.2.88 లక్షలు ఖర్చు చేశారు. సబ్బవరంలో అంబులెన్స్‌ లేక పాలనాయుడు అనే యువకుడు మృత్యువాత పడ్డారు. మన నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ అదిప్‌రాజు ఈ రోజే అంబులెన్స్‌ ఆసుపత్రికి అందజేశారు.
– చౌక దుకాణాల్లో బియ్యం కూడా ఇవ్వకుండా కోతలు పెడుతున్నారు. ఇల్లు ఇవ్వడం లేదు, స్థలాలు ఇవ్వడం లేదు. పింఛన్లు, రేషన్‌కార్డులు, చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచం  ఇవ్వాల్సిందే. గ్రామ గ్రామాన జన్మభూమి కమిటీలతో మాఫీయాను తయారు చేశారు. వారు చెప్పిందే రాజ్యంగా మారింది. లంచం లేనిదే ఏ పని జరగడం లేదు. 
– ఎన్నికలప్పుడు మీరు హామీ ఇచ్చారని చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే..ఇవాళ పరిస్థితి ఏంటో తెలుసా? తాట తీస్తానని, తోక కత్తిరిస్తానని అంటారు. మరికొందరిని ఏకంగా అరెస్టు చేయించి దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ఈ పాలనను గమనించమని కోరుతున్నాను. ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మించే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు వ్యవస్థలను ఏస్థాయిలో మలుచుకుంటారో అన్నదానికి ఈ రోజు ఈనాడు పేపర్‌ చూస్తే అర్థమైంది. పెట్రోల్‌ వంద రూపాయలకు చేరుతుందని రాశారు. పెట్రోల్‌ ధర పక్క రాష్ట్రం కన్న మనకు రూ.7 అధికంగా వసూలు చేస్తున్నారు. కేంద్రం వేసే ట్యాక్స్‌ల కన్నా రాష్ట్రం వేసే ట్యాక్సులు ఎక్కువా అని ఈ పేపర్‌ రాయరు. చంద్రబాబు చెప్పరు.
– ఎన్‌టీ రామారావు భార్య లక్ష్మీపార్వతిని ఎంతగా ఇబ్బంది పెట్టారో అందరికి తెలిసిందే. జగన్‌కు ఓటు వేస్తే రాహుల్‌ గాంధీకి వేసినట్లే అని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు జగన్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అంటారు. ఈయన తానా అంటే ఎల్లోమీడియా తందానా అంటుంది. ఈ చెడిపోయిన వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి. ఇది ఒక్క జగన్‌ వల్ల అయ్యే పని కాదు. జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి. అందరి ఆశీస్సులు కావాలి. అప్పుడు ఈ వ్యవస్థలో విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం వస్తుంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి. ఇది జరగాలి.
– పొరపాటున కూడా అన్యాయం చేసే వ్యక్తి చంద్రబాబును క్షమించవద్దని కోరుతున్నాను. అబద్దాలు చెప్పే ఈ వ్యక్తిని పొరపాటున క్షమిస్తే..రేపు పొద్దున ఏం చేస్తారో తెలుసా? మీ వద్దకు చంద్రబాబు వచ్చి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 98 శాతం అమలు చేశానని మీ చెవ్వుల్లో క్వాలీఫ్లవర్‌ పెడతారు. ఒక చిన్న చిన్న అబద్ధాలు నమ్మరని, ఈ సారి పెద్ద పెద్ద అబద్ధాలు చెబుతారు. ఈ సారి ఓటు వేస్తే ఇంటికి కేజీ బంగారం ఇస్తానని చంద్రబాబు చెబుతారు. నమ్ముతారా? నమ్మరు కాబట్టి బోనస్‌గా బెంజి కారు ఇస్తామంటారు. అయినా నమ్మరని తెలుసు కాబట్టి ప్రతి ఇంటికి తన మనిషిని పంపిస్తారు. ఒక్కొక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. డబ్బులు ఇస్తే కాదనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి లాక్కున్నదే. కానీ ఓటు వేసేటప్పడు మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి. అప్పుడే ఈ చెడిపోయిన వ్యవస్థలో మార్పు వస్తుంది. అబద్ధాలు చెప్పేవారిని, మోసాలు చేసేవారిని బంగాళఖాతంలో కలపండి. 
– మనందరి ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తామన్నది చెప్పేందుకు నవరత్నాలు ప్రకటించాం. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడటమే లక్ష్యం. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవ్వతాతలకు ఏం చేస్తామన్నది ఈ మీటింగ్‌లో చెబుతాను. చంద్రబాబు పాలనలో ఆ రోజు ముష్టి వేసినట్లు రూ.70 ఇచ్చేవారు. ఊర్లో కేవలం పది మందికి ఇచ్చేవారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి  అధికారంలోకి వచ్చాక పింఛన్‌ మూడు రెట్లు పెంచారు. 16 లక్షలు ఉన్న పింఛన్ల సంఖ్యను 75 లక్షలకు తీసుకెళ్లారు. నాన్నగారి హాయంలో పింఛన్లు, సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు కులాలు, మతాలు, రాజకీయాలు చూడలేదు. ఇవాళ మీ అందరికి ఒకటే చెబుతున్నాను. మన ప్రభుత్వం వచ్చాక నాన్నగారు పేదవారి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే..వైయస్‌ఆర్‌ కొడుకుగా రెండు అడుగులు వేస్తానని చెబుతున్నాను. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్‌ మొత్తం రూ.2 వేలకు పెంచుతాను. పింఛన్‌ వయస్సు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తున్నారు. ఇందులో ఏమైనా సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే నేను ఎక్కడ ఉంటానో మీ అందరికి తెలుసు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిని మీ బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని కోరుకుంటూ..పేరు పేరున మీ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
 
Back to Top