కులాలు చూడం..పార్టీలు చూడం

 
గుంటూరు: రేపు పొద్దున వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే రాజ్యంగ విరుద్ధంగా ఏర్పడిన జన్మభూమి కమిటీలను రద్దు చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. రేపు పొద్దున దేవుడు అశీర్వదించి, మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం వచ్చాక గ్రామ సెక్రటరేట్‌ ఏర్పాటు చేస్తాం. మీకు రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీకార్డు, పింఛన్లు, ఏది కావాలన్నా మీరు అప్లికేషన్‌ పెట్టిన 72 గంటల్లోనే మీ చేతుల్లో పెడతాం. కులాలు చూడం, మతాలు చూడం, పార్టీలు చూడం, ఎవరికి అర్హత ఉన్నా కూడా అందరికి ఇస్తామని మాట ఇస్తున్నాను. జన్మభూమిలు అప్రూర్‌ చేస్తే తప్ప పింఛన్లు రావడం లేదని అక్కా చెల్లెమ్మలు చెబుతున్నారు. లంచం ఇస్తేనే వారు సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నారు. అర్హులైన ప్రతి వ్యక్తికి ఏ పార్టీ అయినా కూడా రాజకీయాలు చూడకుండా అర్హులందరికి మేలు చేస్తాం. 

నాయీ బ్రహ్మణులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌

నాయిబ్రాహ్మణులకు 250 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రతి మంగలి షాపుకు 250 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని మాట ఇచ్చారు. అలాగే చట్టసభలో ఈ సారి సీట్లు ఇవ్వలేని ప్రతి కులానికి ఎక్కడో ఒక చోట అవకాశం కల్పిస్తామన్నారు. చట్టసభలోకి తీసుకువస్తాం. ప్రతి మేజర్‌ టెంపుల్‌లో నాయిబ్రాహ్మణులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇస్తున్నాను. 

యాదవ సోదరుల ముఖంలో కన్నీరు రాకుండా చూస్తాం
యాదవుల పరిస్థితి ఈ రోజు అధ్వాన్నంగా ఉంది. గొర్రెలు, మేకలకు ఏదైనా రోగం వచ్చి చనిపోతే పట్టించుకునే నాథుడు లేడు. యాదవ కులస్తులు కష్టపడి వాటిని పోషిస్తే అవి అకాల మరణం పొందడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. నాన్నగారి పాలనలో గొ్రరెలకు, మేకలకు చెవి పోగులు వేసేవారు. ఏ గొర్రెలు చనిపోయినా పరిహారం ఇచ్చేవారు. రేపొద్దున మనందరి ప్రభుత్వం వచ్చాక ఏ యాదవ సోదరుడి ముఖంలో కన్నీరు లేకుండా చూస్తాను. ఏ గొర్రెలు చనిపోయినా కచ్చితంగా రూ. 6 వేల   ఇన్సూరెన్స్‌ ఇస్తాం. ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. మనం చేసే ప్రతి పథకం కూడా కారణాలు వెతుక్కోకుండా అందరికి మేలు చేస్తామన్నారు. 

వడ్డెరలకు ఎమ్మెల్సీ పదవి..
వడ్డెరలకు ఎమ్మెల్సీ ఇస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. వడ్డెర్లకు సంబంధించిన వెల్‌ఫేర్‌ ఫండ్‌ను చంద్రన్న బీమా పథకానికి డైవర్ట్‌ చేశారన్నారు. ఆ విషయాన్ని అడిగేందుకు చంద్రబాబును అపాయింట్‌మెంట్‌ అడిగితే కూడా ఆయన పట్టించుకోవడం లేదు. మన ప్రభుత్వం వచ్చాక వెల్‌ఫర్‌ ఫండ్‌ రిస్టోర్‌ చేస్తామని హామీ ఇచ్చారు.

ఆత్మీయ సమ్మేళనంలో చాలా మంది నుంచి సలహాలు, సూచనలు తెలుసుకున్నాను. రాష్ట్రవ్యాప్తంగా జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ, ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటున్నారు. పాదయాత్ర అనంతరం అందరం ఒక్కచోట ఏకమై బీసీ డిక్లరేషన్‌ ద్వారా అందరికి తోడుగా ఉండే కార్యక్రమం చేపడుతాం. అందరితో మాట్లాడలేకపోయాను. కొందరితోనైనా మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉందని వైయస్‌ జగన్‌ చెప్పారు. Back to Top