కొల్లేరుపై సమగ్ర అధ్యయనం చేస్తాం


కృష్ణా జిల్లా: కొల్లేరుపై సమగ్ర అధ్యయనం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. కొల్లేరు ప్రాంతాన్ని రీ సర్వే చేయించి భూములు వెనక్కి ఇప్పిస్తానని మాట ఇచ్చారు. 
పెరికగూడెం వద్ద వైయస్‌ జగన్‌ను కొల్లేరు ప్రాంతవాసులు కలిశారు. ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు పరిమితం చేయాలని కొల్లేరు వాసులు వైయస్‌ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఆక్రమణల పేరుతో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. 750 ఎకరాల జీరాయితీ భూమిని నాశనం చేశారని కొల్లేరు వాసులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. జీరాయితీ భూమిని తిరిగి ఇప్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు. కొల్లేరువాసుల సమస్యలపై వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. కొల్లేరువాసులకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ హామీతో కొల్లేరు వాసులు హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top