హోదా కోసం పోరాడే వారందరికీ అండగా ఉంటాంగుంటూరు:  ప్రత్యేక హోదా సాధనకు పోరాటం చేసే వారందరికీ వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు టౌన్‌లో బుధవారం హోదా సాధన కమిటీ సభ్యులు వైయస్‌ జగన్‌ను కలిశారు. హోదా కోసం వైయస్‌ జగన్‌ చేస్తున్న పోరాటాన్ని సాధన కమిటీ సభ్యులు ప్రశంసించారు. మొదటి నుంచి మీరు ఒకే మాటపై నిలబడి హŸదాను సజీవంగా ఉంచారని ప్రశంసించారు.  అన్ని రాజకీయ పక్షాలను, సంఘాలను కలుపుకొని హోదా పోరాటానికి నాయకత్వం వహించాలని కోరారు. అలాగే ఉద్యమకారులపై పెట్టిన కేసులె ఎత్తి వేసేలా పోరాటం చేయాలని కోరారు.  ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..హోదా ఉద్యమకారులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండు చేశారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లింది ప్రత్యేక హోదా కోసం కాదని, మరోసారి మభ్యపెట్టేందుకే చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హోదా సాధనకు ఇప్పటికే కార్యాచరణ ప్రకటించామని, త్వరలోనే సమావేశమై మరోసారి తదుపరి కార్యాచరణపై చర్చిద్దామని కమిటీ సభ్యులకు వైయస్‌ జగన్‌ చెప్పారు.  చంద్రబాబు ప్రత్యేక హోదా అడగలేదని, ప్లానింగ్‌ కమిషన్‌ను అడిగి ఉంటే హోదా వచ్చేదన్నారు.   
 
Back to Top