గిరి‘జననేత’


– గిరిజనులకు వైయస్‌ జగన్‌ వరాలు
– గిరిజనులకు పావలా వడ్డీకే రుణాలు
– అధికారంలోకి రాగానే బ్యాక్‌లాగ్‌పోస్టులు భర్తీ 
– గిరిజనులను ఆదుకోవాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు
– ప్రతి కుటుంబానికి భూముల పంపిణీ
– గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్‌
– ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తాం
– ఐటీడీఏ పరిధిలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్, ఇంజినీరింగ్‌ కాలేజీలు
– 500 కుటుంబాలు ఉన్న గూడెలు, తాండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తింపు


పశ్చిమ గోదావరి జిల్లా: అభివృద్ధికి దూరంగా ఉంటున్న గిరిజనులకు భరోసా లభించింది. గిరిజనులకు తోడుగా ఉంటానని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్ర 166వ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ప్రకాశరావుపాలెంలో గిరిజనులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వైయస్‌ జగన్‌ పాల్గొని వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి వరాల జల్లులు కురిపించారు. చంద్రబాబు ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే తోఉడా ఉండి అభివృద్ధికి బాటలు వేస్తామని మాట ఇచ్చారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..గిరిజన ప్రాంతాలు, తాండాల్లో నివసిస్తున్న వారికి నేడు వైద్యం కరువైందన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచిందని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే.. ఆరోగ్యశ్రీని మెరుగు పరుస్తామని హామీ ఇచ్చారు. జ్వరాలు వచ్చినా..మలేరియా వచ్చినా ..వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామన్నారు. వైద్యవాడికి ఉచితంగా ఆపరేషన్‌ చేయించడమే కాదు..విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10 వేల పింఛన్‌ ఇచ్చి ఆదుకుంటామన్నారు.
–  ప్రతి పేదవాడు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదవేందుకు ఎన్ని లక్షలు ఖర్చైనా దగ్గరుండి చదివిస్తామన్నారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులకు ప్రతి ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారు. చిన్న పిల్లలను బడికి పంపిస్తే తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15 వేలు ఇచ్చి తోడుగా ఉంటామన్నారు. 
–నవరత్నాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. 500 జనాభా ఉన్న తాండాలను, గూడెంలను పంచాయతీలుగా చేస్తామని హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హాయంలో 800 తాండాలను పంచాయతీలుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించారన్నారు. దురదృష్టవశాత్తు నాన్నగారు చనిపోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయిందన్నారు. ఇందుకోసం గట్టిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
– ప్రతి తాండాలకు, గూడెలకు ఉచితంగా కరెంటు ఇస్తామని మాట ఇచ్చారు. గిరిజనులు కరెంటు బిల్లుల కోసం భయపడాల్సిన అవసరం లేదన్నారు. 
– గిరిజన కుటుంబాలకు, ఎస్సీలకు భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆ రోజుల్లో 32 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశారన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎస్టీ, ఎస్సీల నుంచి బీసీలు, మైనారిటీల వరకు కొనసాగిస్తామన్నారు. భూములు ఇవ్వడమే కాకుండా ప్రతి ఏటా వ్యవసాయం చేసుకునేందుకు రూ.12,500 ఇస్తామని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పారు.
ఉచితంగా బోర్లు వేస్తామని మాట ఇచ్చారు. కరెంటు కనెక్షన్‌ ఇప్పిస్తామన్నారు.
– ఇల్లు లేని ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టించి ఇస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 
– ప్రతి ఐటీడీఏ పరిధిలోనూ ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరారని, కచ్చితంగా ఆసుపత్రి కట్టిస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఐటీడీఏ పరిధిలో ఇంజినీరింగ్, మెడికల్‌కాలేజీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని రకాలుగా తోడుగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
– పోలవరం నిర్వాసితులకు తోడుగా ఉంటానని మరోమారు మాట ఇచ్చారు. ఇంటి సైజు పెంచుతానని చెప్పారు. నాన్నగారి హాయంలో రూ.1.50 లక్షలు మాత్రమే పరిహారం ఇచ్చారని, ఇవాళ భూములు తీసుకున్న వారికి ఎక్కువ రేటు ఇస్తున్నారని గిరిజనులు తనకు చెప్పారని, వారందరికి కూడా మానవతదృక్ఫథంతో మేలు చేస్తామని మాట ఇచ్చారు. ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల పరిహారం ఇస్తామన్నారు. 
నిర్వాసితులు నిజంగా దేవుళ్లవంటి వారని, వారు త్యాగం చేయకపోతే పోలవరం సాధ్యం అయ్యేది కాదన్నారు. త్యాగాలను చేసిన వారిని గౌరవిం^è కపోతే మానవత్వం లేనట్లే అన్నారు.
– చంద్రబాబు క్యాబినెట్‌లో ఒక్క గిరిజనుడికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. ఈ కేబినెట్‌లో గిరిజనుడు లేని మంత్రి వర్గం ఇదే అన్నారు. నాపై ప్రేమానురాగాలు చూపిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు  ..
 

తాజా వీడియోలు

Back to Top