ప్రతి రైతుకు పంట పెట్టుబడి చెల్లిస్తాం

చిత్తూరు: రైతుల కష్టాలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చలించి పోయారు. అప్పుల్లో ఉన్న అన్నదాతలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఏటా రైతుకు పెట్టుబడులకు మే, జూన్‌ మాసంలోనే రూ.12,500 చొప్పున అందజేస్తామని మాట ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ కందూరు సమీపంలో వరి పొలాన్ని సందర్శించారు. రైతుల ఇబ్బందులను అడిగి లె లుసుకున్నారు. ఈ సందర్భంగా వరి ధాన్యాన్ని తూర్పు పోశారు. అనంతరం రైతులు తమ గోడు వైయస్‌ జగన్‌ వద్ద వెల్లబోసుకున్నారు. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి మాకు  కష్టాలు తప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదని తెలిపారు. బ్యాంకు అధికారులు రోజు ఫోన్‌ చేసి అప్పులు కట్టమని ఒత్తిళ్లు తెస్తున్నారని వైయస్‌ జగన్‌కు రైతులు ఫిర్యాదు చేశారు. వడ్డీలే కట్టుకోవాలా?..పెట్టుబడులే పెట్టుకోవాలా? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇల్లెలా గడుస్తుందని..పిల్లల చదువెలా సాగేదని రైతులు వైయస్‌ జగన్‌ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. ఈ ఏడాది సన్న మసూరీ, ఆరునర వరి రకం పంట సాగు చేశామని జననేత దృష్టికి తీసుకెళ్లారు.  ఎకరాకు రూ.20 నుంచి రూ. 30 వేల పెట్టుబడి పెట్టామని చెప్పారు. ఎకరాకు 75 కేజీ 25 బస్తాలు మాత్రమే దిగుబడి వస్తుందని, బస్తా రూ.1000 చొప్పున కొనుగోలు చేస్తున్నారని రైతులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. పెట్టుబడులు కూడా చేతికి అందడం లేదని, బ్యాంకులకు అప్పులెలా కడుతామని వాపోయారు. ప్రతిసారి మూడు, నాలుగు వేలు చేతి నుంచి పడుతుందని చెప్పారు. పశువులకు గ్రాసం వస్తుందని వరి సాగు చేస్తున్నామని తెలిపారు.  బ్యాంకులకు డబ్బులు కట్టలేక, బయట వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తుందన్నారు. మనం రైతు భరోసా కింద ప్రతి ఏటా రూ.12,500 పెట్టుబడి కింద ఇస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, సాగునీరు ఇచ్చి అండగా ఉంటానని జననేత మాట ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top