విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తాం


నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం కాంట్రాక్ట్‌ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. సర్వీసు, అర్హతల ఆధారంగా ఎలక్రిసిటీ, ఆర్టీసీ, ఉపాధ్యాయుల సమస్యలను తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. మరో ఏడాది ఓపిక పట్టాలని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు దేవున్ని మొక్కాలని ఆయన కోరారు. వైయస్‌ జగన్‌ హామీతో కాంట్రాక్ట్‌ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంకల్ప యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
 
Back to Top