క్లీనిక్‌లు పెట్టుకోవడానికి వడ్డీలేని రుణాలు

పశ్చిమ గోదావరి: కష్టపడి చదివి చేతిలో పట్టాలు పట్టుకొని బయటకు వస్తే.. ప్రభుత్వం తమకు ఎలాంటి అవకాశాలు చూపడం లేదని డెంటల్‌ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో డెంటల్‌ డాక్టర్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్నో ఖాళీలు ఉన్నా.. వాటిని భర్తీ చేయడం లేదని వాపోయారు. డెంటల్‌ డాక్టర్ల సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పీహెచ్‌సీలో పోస్టులు తీస్తానని, ఆరోగ్యశ్రీలో డెంటల్‌ను ఇన్‌క్లూడ్‌ చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా ప్రైవేట్‌గా క్లీనిక్‌లు పెట్టుకోవడానికి వడ్డీలేని రుణాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. 
Back to Top