చిన్నారికి ఆపరేషన్‌ చేయిస్తానని జననేత హామీ

పశ్చిమగోదావరి: ఆరోగ్యశ్రీ ఉన్న ప్రయోజనం లేదు.. తమ బిడ్డకు ఆపరేషన్‌ చేయించాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారని పశ్చిమగోదావరి జిల్లా నడింపల్లికోటకు చెందిన శాంతి, శ్రీనివాస్‌ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ దంపతులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యను చెప్పుకున్నారు. తమ చిన్నారికి పుట్టుక నుంచి మూగ, వినికిడి సమస్య ఉందని, ఆస్పత్రులకు వెళితే.. ఆరోగ్యశ్రీ పనిచేయదని చెబుతున్నారన్నారు. ఆపరేషన్‌ చేసుకోవడానికి రూ. 10 లక్షలు ఖర్చు అవుతుందని చెబుతున్నారన్నారు. అంత స్తోమత లేదని, తమ బిడ్డకు ఆపరేషన్‌ చేయించాలని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ దంపతులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ మేరకు చలించిన వైయస్‌ జగన్‌ చిన్నారికి ఆపరేషన్‌ చేయిస్తానని హామీ ఇచ్చారు. 
 
Back to Top