బేడ బుడగ జంగాలకు న్యాయం చేస్తాంతూర్పు గోదావరి:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే బేడ బుడగ జంగాల కులస్తులకు న్యాయం చేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 194వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన బేడ బుడగ జంగాల కులస్తులు రాజోలి నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ కులాన్ని ప్రభుత్వంఇంతవరకు గుర్తించడం లేదన్నారు. పిల్లలను బడిలో చేర్పించాలంటే ఏ కులమని అడుగుతున్నారని, తమకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పొట్ట చేత పట్టుకొని ఊరురా తిరుగుతున్నామని, తమ పిల్లల భవిష్యత్‌ కోసం కృషి చేయాలని బేడ బుడగ జంగాల సంఘం నాయకుడు నరసింహులు, తదితరులు వైయస్‌ జగన్‌ను కోరారు. వారి సమస్యలు సావధానంగా విన్న జననేత భరోసా కల్పించారు. మనందరి ప్రభుత్వం వచ్చాక బేడ బుడగ జంగాల కులస్తులను గుర్తిస్తామని మాట ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీతో వారు హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top