45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తాం


అనంతపురం: పింఛన్‌ వయస్సు 45 ఏళ్లకే తగ్గించి, నెలకు రూ.2 వేల చొప్పున పింఛన్‌ ఇస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం గుత్తిరోడ్డులో స్థానికులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తమకు పింఛన్‌ రావడం లేదని, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని, రుణాలు మాఫీ కాలేదని వంటి సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అన్యాయం చేస్తుండటంతో పాదయాత్ర చేపట్టానని తెలిపారు. మరో ఏడాదిలో మీ అందరి కష్టాలు తీరుతాయని, అందరికీ న్యాయం చేస్తానని, అన్నొస్తున్నాడని అందరికి ధైర్యంగా చెప్పండని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. మీ పిల్లలను బడికి పంపించండి, వారి చదువులకు అయ్యే ఖర్చులు తాను భరిస్తానని భరోసా కల్పించారు.  పొదుపు రుణాలు నాలుగు విడతల్లో మాఫీ చేసి ఆ డబ్బులు మీ చేతికే ఇస్తామని, ఆ డబ్బుతో ఏమైనా చేసుకోండని మహిళలకు మాట ఇచ్చారు. వైయస్‌ జగన్‌ హామీతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top