నార్కెట్‌పల్లి పచ్చళ్లకు మార్కెట్‌ కల్పిస్తా

కొత్తపేట: నార్కెట్‌పల్లి పచ్చళ్లకు మార్కెట్‌ కల్పిస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఆత్రేయపురం మండలంలో ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను లొల్ల గ్రామంలో నార్కట్‌పల్లి గ్రామానికి చెందిన పచ్చళ్లు తయారు చేసే మహిళలు కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను జననేత అడిగి తెలుసుకున్నారు. ముడి సరుకుల ధరలు పెరగడం, జీఎస్టీ గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక టన్ను ఊరగాయ పట్టేందుకు సుమారు రూ. 60 వేల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇంతకు ముందు తయారీకి రుణాలు ఇచ్చేవారిని ఇప్పుడు చంద్రబాబు రుణాలు ఇవ్వడం లేదన్నారు. పచ్చళ్లు తయారు చేసి పక్క రాష్ట్రాల్లో అమ్మేందుకు తీసుకెళ్లే సేల్స్‌ట్యాక్స్‌ అంటూ అధికారులు ఆపి వ్యాపారం సాగనివ్వడం లేదని మొరపెట్టుకున్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పచ్చళ్ల లోన్లు మాఫీ చేయాలని, తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలని, అదే విధంగా జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరారు. దీనిపై వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. 
 
Back to Top