కాసేపట్లో వైయ‌స్ జగన్ ప్రెస్ మీట్

హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రతిపక్ష నేత, వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో మీడియా స‌మావేశం నిర్వహించనున్నారు. లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో బీజేపీ, టీడీపీలు వ్యవహరిస్తున్న దుర్మార్గ వైఖరికి నిరసనగా ఆగస్టు 2న ఏపీ బంద్‌కు వైయస్సార్సీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. 

Back to Top