హోదా పోరాటం ఇంతటితో ఆగదు


–  బంద్‌ను అణచివేసేందుకు చంద్రబాబు కుట్రలు 
– చంద్రబాబు చేస్తుంది ధర్మ పోరాటామా? అధర్మ పోరాటమా?
– నాలుగేళ్లుగా బాబు హోదాను నీరుగార్చుతున్నారు
– ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మేం సజీవంగా ఉంచాం
– బాబు ప్రతి అడుగులోనూ రాజకీయ స్వార్థమే
– వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త దుర్గారావు మరణించారు
– హోదా కోసం ఎవరు ఉద్యమించినా మేం మద్దతిచ్చాం
– హోదా కోసం చిత్తశుద్ధితో పోరాటం చేసే మాపై బండలు వేస్తున్నారు
– బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను చంద్రబాబు మేనేజ్‌ చేస్తున్నారు
– పవన్‌ కళ్యాన్‌ విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదం

తూర్పు గోదావరి:  ప్రత్యేక హోదా ఏపీ ప్రజల ఆకాంక్ష అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా అతి దారుణంగా బంద్‌ను అణచివేసే యత్నం చంద్రబాబు ప్రభుత్వం చేసిందన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగుతుందని, ఇంతటితో ఆగదని పేర్కొన్నారు.  బంద్‌కు మద్దతు తెలిపిన అన్ని వర్గాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 
 
సామర్ల కోటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైయస్‌ జగన్‌ మాట్లాడారు.
ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హోదా కావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తూ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. దగ్గరుండి అతికిరాతకంగా, దారుణంగా ప్రత్యేకహోదాకు వ్యతిరేకంగా బంద్‌ను విఫలం చేసేందుకు చంద్రబాబు చేయని కుట్ర లేదు. నిజంగా ఈ రోజు జరిగిన బంద్‌ చూస్తే..మొట్ట మొదటగా ఇన్ని కుట్రల మధ్య, దారుణమైన అణచివేతల మధ్య బంద్‌లో పాల్గొని ప్రత్యేక హోదా అన్నది మా హక్కు అని చాటినందుకు, నైతికంగా మద్దతు తెలిపిన వారికి, పాల్గొన్న జర్నలిస్టు సంఘాలకు, మేధావులకు, కార్మిక సంఘాలకు, దుకాణ యజమానులకు, స్కూళ్ల యజమాన్యాలకు, విద్యార్థులకు హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 
– శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 350 మందికి పైగా అరెస్టు చేశారు. తమ్మినేని సీతారాం, ధర్మనా, అప్పలరాజు తదితరులను అరెస్టు చేశారు. ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నం చేశారు.
– విజయనగరం జిల్లాలో 350కిపైగానే అరెస్టులు చేశారు. దుకాణాలు స్వచ్ఛందగా బంద్‌ నిర్వహించారు.
– విశాఖలో సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేశారు. స్కూళ్లు మూతపడ్డాయి. వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.
–  తూర్పు గోదావరి జిల్లాలో సీనియర్‌ నాయకులను అరెస్టు చేశారు. కన్నబాబు, జగ్గిరెడ్డి, విశ్వరూప్, ద్వారంపూడి తదితరులను సాయంత్రం వరకు స్టేషన్‌లో పెట్టారు. నేతలను అదుపులోకి తీసుకొని బస్సులు నడిపేందుకు విశ్వప్రయత్నం చేశారు. 530 మందిని అరెస్టు చేశారు.
– పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఆళ్లనానిని అరెస్టు చేశారు. సీనియర్‌ లీడర్లనుఅరెస్టు చేశారు. బుట్టాయిగూడెంలో కాకి దుర్గారావు బంద్‌లో పాల్గొనగా అరెస్టు చేయడంతో ఆయన గుండెపోటుతో మృతి చెందారు.
– ప్రకాశంలో  జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ పెట్టి నాయకులను అరెస్టు చేశారు. బాలినేని వాసు, మహిధర్‌రెడ్డిలను అరెస్టు చేశారు. 650 మందిని అదుపులోకి తీసుకున్నారు. బంద్‌లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
– నెల్లూరు జిల్లాలో 850 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయినా స్వచ్ఛందంగా ప్రజలు బంద్‌లో పాల్గొన్నారు. స్కూళ్లను మూసివేశారు.
– కర్నూలు జిల్లా నంద్యాలలో డీఎస్సీ గోపాలకృష్ణ మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించారు. జిల్లాలో 600 మందిని అరెస్టు చేశారు. అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి.
– వైయస్‌ఆర్‌ జి ల్లాలో ఎక్కడపడితే అక్కడ అరెస్టులు చేశారు. ఆర్టీసీ బస్టాండ్‌లో మేయర్‌ సురేష్, అంజాద్‌బాషా, రవీంద్రనాథ్‌రెడ్డిలను అరెస్టు చేశారు.
– అనంతపురంలో సీనియర్‌ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేశారు. తోపులాట జరిగింది. ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డిని బలవంతంగా అరెస్టు చేశారు.
– చిత్తూరు జిల్లాలో 1250 మంది ని అరెస్టు చేశారు. కుప్పంలో కూడా స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు మూత వేసి బంద్‌లో పాల్గొన్నారు. కుప్పంలో ప్రజలు కోరుతున్నా కూడా చంద్రబాబుకు వినపడటం లేదు.
– కృష్ణా జిల్లాలో సీనియర్‌ నాయకులు పార్థసారధి, వంగవీటి రాధా, మల్లాది, వెల్లంపల్లి తదితరులను అరెస్టు చేశారు. ఈ జిల్లాలో 600పైగా అరెస్టు చేశారు. 
–గుంటూరు జిల్లాలో 1100 మందిని అరెస్టు చేశారు. స్వచ్ఛందంగా విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొన్నారు.
– రాష్ట్రవ్యాప్తంగా ఇన్ని అరెస్టుల చేశారు. బలవంతంగా ఆర్టీసీ బస్సులు తిప్పడానికి చంద్రబాబు విఫలయత్నం చేశారు. చంద్రబాబు గారు..మీరే ముందుకు వచ్చి మీ ఎంపీల చేత రాజీనామా చేయించి, దేశం మొత్తం మనవైపు చేయిస్తే..మీరే బంద్‌లో పాల్గొనాల్సి ఉండగా, అవిశ్వాస తీర్మానంలో ప్రత్యేక హోదా ఇవ్వండి అని డిమాండు చేస్తే.. ప్రత్యేక హోదా మీ వల్లే కేంద్రం ఇవ్వడం లేదని చెబుతుంటే, మీరు ఒప్పుకున్నారని కేంద్రం చెబుతుంటే నిరసన తెలపాల్సింది పోయి, ఎంపీలతో రాజీనామాలు చేయించాల్సింది పోయి, ప్రత్యేక హోదాకు అడ్డుతగిలిన బీజేపీకి నిరసగా, రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మీపై నిరసనగా బంద్‌ చేపడితే నీవు చేసిన నిర్వాహకం  ఇది.
– పశ్చిమ గోదావరి జిల్లాలో దుర్గా ప్రసాద్‌ గుండెపోటుతో చనిపోయాడు. కారణం చంద్రబాబు కాదా? ప్రత్యేక హోదా కావాలని ఓ స్వరం గట్టిగా వినిపిస్తే..ఆ వ్యక్తి గుండె పోటు వచ్చేలా వ్యవహరించారు. ఇంతకంటే దారుణం ఏముంది? 
– పోలీసులు కాలర్‌ పట్టుకొని ఈడ్చుకుంటూ పోతున్నారు. పోలీసులు లాఠీ చార్జ్‌ చేస్తున్నారు. మహిళలు అని కూడా చూడకుండా మగ పోలీసులతో నిర్బంధం.
విద్యార్థులను ఈడ్చుకుంటూ పోతున్నారు. ఐదు సార్లు ఎంపీగా చేసిన అనంత వెంకట్రామిరెడ్డిపై, బాలినేని శ్రీనివాసరెడ్డి, తమ్మినేని సీతారాంలపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు బాధాకరం. 
– చంద్రబాబుకు బుద్ధి వచ్చే రోజు త్వరలోనే వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆయన చేస్తున్న అబద్ధాలు, మోసాలు తారా స్థాయికి చేరాయి. వంద తప్పులు చేసిన శిశుపాలుడికి కూడా శిక్ష తప్పదు అన్నట్లుగా చంద్రబాబుకు కూడా దేవుడు మొట్టికాయలు వేస్తాడు. 
– ప్రత్యేకహోదాను దగ్గరుండి కాలరాస్తున్నందుకు చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలుగా మనం ఉద్యమించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పోరాటం ఇంతటితో ఆగిపోదు. హోదా వచ్చేదాకా ఖచ్చితంగా ఈ ఒత్తిడి కొనసాగిస్తాం.
– చంద్రబాబుకు సిగ్గు,శరం ఏమాత్రం ఉంటే ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో ఇప్పటికైనా ముందుకు రావాలని కోరుతున్నాను. చంద్రబాబును ప్రజలు చరిత్రహీనుడిగా చూస్తారని హెచ్చరిస్తున్నాను. 
– బంద్‌లో పాల్గొనడానికి అనసక్తి చూపించారో వారందరు ఎందుకు అలా చేశారో ప్రజలు గమనిస్తున్నారు. ప్రత్యేక హోదా అన్నది రాజకీయాలకు అతీతంగా ఎవరు పిలుపునిచ్చినా మద్దతిచ్చాం. ప్రత్యేక హోదా కోసం రాజకీయ స్వార్థంతో వెనుకడుగు వేసే ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. హోదా కోసం పార్టీలకు అతీతంగా అందరం ఒక్కటై సాధిద్దాం. అయినా రాజకీయ స్వార్థాలు వచ్చి పాల్గొనని పార్టీలకు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. 
– అయ్యా..చంద్రబాబు స్వాతంత్య్రానికి ముందు నీవు నాయకుడిగా ఉండి ఉంటే..ఎందుకయ్య స్వాతంత్య్రం చేస్తున్నారని, బ్రిటీష్‌ వాళ్లు బాగానే చేస్తున్నారు కదా? ప్యాకేజీ తీసుకుందామని అనే వారు. 
– బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నది ఎవరు? లేని ప్యాకేజీ ఉన్నట్లు చంద్రబాబు ఆమోదంతో, ఆయనతో కలిసి కట్టుగా అరుణ్‌జైట్లీ అర్ధరాత్రి ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. అదే అర్ధరాత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. సెప్టెంబర్‌ 7వ తేదీ తరువాత మేం కేంద్ర ప్రభుత్వం చెవిలో క్వాలీఫ్లవర్‌ పెడుతుందని నేను మాట్లాడాను. ఆ తరువాత అసెంబ్లీలో చంద్రబాబు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని వ్యతిరేకించాం. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు ట్యూషన్‌ చెప్పాం. ఎన్నికలకు ఆరు నెలలకు ముందు చంద్రబాబు బీజేపీతో విడాకులు తీసుకొని, తానే పోరాటం చేస్తున్నట్లు డ్రామాలాడుతున్నారు. వీడియో రికార్డులు చూపిస్తున్నారు. మేం యువభేరీ సభల్లో ఆ వీడియోలన్నీ చూపించాం. బీజేపీ ప్రభుత్వంపై తుది దాకా పోరాటం చేసి, ఎన్నిలకు 15 నెలల ముందే బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామాలు చేసింది వైయస్‌ఆర్‌సీపీనే. ప్రత్యేక హోదాను గట్టిగా పట్టుబట్టి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది జగన్‌ అనే వ్యక్తి. ఇన్ని రకాలుగా చిత్తశుద్ధితో ఏపీ ప్రజల తరఫున కేంద్రంలో ఎవరు ఉన్నా లెక్క చేయకుండా పోరాటం చేస్తుంటే జగన్‌పై బండలు వేస్తున్నారు. పూటకో మాట మాట్లాడుతూ చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఎదురు ప్రశ్నలు వేశారు. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని ఎదురు ప్రశ్నలు వేశారు. ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించి, అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాలు చేశారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తరువాత కూడా టీటీడీలో బీజేపీ మహారాష్ట్ర మంత్రి భార్యకు బోర్డు మెంబర్‌గా నియమించారు. మరో కేంద్ర మంత్రి నిర్మాల సీతారాం భర్త పరకాల ప్రభాకర్‌ను తన పక్కనే పెట్టుకుంటారు. ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చానని చెబుతారు..బాలకృష్ణ సినిమా షూటింగ్‌ వెంకయ్యనాయుడు ఉంటారు.
–  ప్రత్యేక హోదా కోసం 25 మంది ఎంపీలు రాజీనామా చేసి నిరాహార దీక్షలు చేపట్టి ఉంటే కేంద్రం దిగి వచ్చేది కాదా? ఇవన్నీ వాస్తవాలు అని తెలుసినా..చంద్రబాబు ఒక వైపు బీజేపీతో చెలిమిగా తిరుగుతారు. మరోవైపు కాంగ్రెస్‌ను కూడా మేనేజ్‌ చేస్తున్నారు. అంత గొప్ప వ్యక్తి చంద్రబాబు. ప్రజలను మోసం చేస్తున్నానని ఆయన క్రిడిట్‌ తీసుకోవచ్చు కానీ, అవకాశం వచ్చినప్పుడు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారు.
– పవన్‌ కళ్యాణ్‌ కూడా నాలుగేళ్లు బీజేపీ, టీడీపీలో కలిసి  కాపురం చేశాడు.  ఆయన కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చి ..తాను తప్పు చేశానని చెబుతున్నారు. ఏపీని ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి పొడిచేశారు. నాలుగేళ్లు గమ్మున ఉన్నారు.  ఇన్నాళ్లుగా కలిసికట్టుగా సంసారం చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతున్నారు. ఒకరేమో నేను తప్పు చేశానని అంటారు. ఇంకొకరేమో..నేను తప్పు చేసింది..మిగతా ఇద్దరు కలిసి  తప్పు చేశారని అంటారు.  ఇంకొకాయన ఏమంటారంటే..ఆ ఇద్దరు ఆమోదం తెలిపిన తరువాత నేను చంపేశారని అంటాడు. నాలుగేళ్లలో అప్పుడప్పుడు బయటకు వచ్చి చంద్రబాబును రక్షించే ప్రయత్నం చేశారు. ఇలాంటి వ్యక్తి విలువల గురించి మాట్లాడుతారు. ఆయనకు నలుగురు పెళ్లాలు ఉన్నారు. కొత్త కార్డులు మార్చినట్లు పెళ్లాలను మార్చుతున్నారు. నాలుగేళ్లకోసారి పెళ్లిన్ని మార్చుతాడు. ఇలాంటివి మనం చేసి ఉంటే నిత్యపెళ్లి కొడుకు అని బొక్కలో వేసేవారు. ఇది పాలీగామీ కాదా?. ఇలాంటి వ్యక్తి మాట్లాడితే విలువలు ఎక్కడివి. ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చి తానేదో చచ్చిలుడని మాట్లాడటం దారుణం. ఇలాంటి వారిని చూస్తే నిజంగా బాధనిపిస్తుంది.


 
Back to Top