మల్లన్న స్వామిని దర్శించుకున్న వైయస్ జగన్

కర్నూలు : వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం శ్రీశైల మల్లన్న స్వామిని దర్శనం చేసుకున్నారు. అంతకు ముందు ఆలయ సంప్రదాయం ప్రకారం జేఈవో, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కాగా జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు వైయస్‌ జగన్‌ చేపట్టిన రైతు భరోసా యాత్ర నేటికి రెండోరోజుకు చేరింది.

శ్రీశైలం నియోజకవర్గం దోర్నాలలో యాత్ర కొనసాగనుంది. ముందుగా దోర్నాలలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్ మాట్లాడతారు. అక్కడ నుంచి ఆత్మకూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

తాజా వీడియోలు

Back to Top