లింగాపురం చర్చిలో వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర జిల్లాలో ఐదవ రోజు కొనసాగుతోంది. ఆయన సోమవారం ఉదయం బండి ఆత్మకూరు మండలం లింగాపురం నుంచి అయిదోరోజు యాత్రను ప్రారంభించారు. అంతకు ముందు లింగాపురం చర్చిలో వైయస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లింగాపురం నుంచి ఓంకారం, కడమల కాల్వ, వెంగళరెడ్డిపేట వరకూ రోడ్‌ షో నిర్వహిస్తారు. అనంతరం బి.కోడూరు గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన చాంద్‌భాషా కుటుంబాన్ని వైయస్‌ జగన్‌ పరామర్శిస్తారు. అక్కడ నుంచి రోడ్‌ షో వెంగళరెడ్డి పేట నుంచి నేరుగా పుట్టుపల్లె, అబ్బీపురం మీదగా మండలం కేంద్రమైన ఎం.తిమ్మాపురం చేరుకుంటుంది. అక్కడ దూదేకుల చిన్నస్వామి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం బుక్కాపురం వరకూ రోడ్‌ షో చేపడతారు.

Back to Top