జననేత రాకతో జనసంద్రమైన ప్రత్తిపాడు

గుంటూరు: ప్రత్తిపాడు  జనసంద్రమైంది. ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జనంతో కిక్కిరిసిపోయింది.  వైయస్ జగన్ రాక నేపథ్యంలో ప్రజలు ప్రత్తిపాడుకు పోటెత్తారు.  తమ అభిమాన నేతకు నీరాజనం పట్టారు. ప్రత్తిపాడుకు వచ్చిన జననేత స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఉన్నబీఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్‌రాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుమారు అరగంట పాటు ప్రత్తిపాడులోనే ఆయన గడిపారు. దారి పొడవునా బారులు తీరిన మహిళలు, అభిమానులతో కరచాలనం చేస్తూ వైయస్ జగన్ పెదగొట్టిపాడు వైపు ముందుకు సాగారు.

Back to Top