వర్షంలోనే జననేత పాదయాత్రవిశాఖ: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన వైయస్‌ జగన్‌ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజలు కూడా ఆయనపై ఉన్న అభిమానంతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాజన్న బిడ్డ వెంట అడుగులో అడుగులు వేస్తున్నారు. జననేతను కలిసి సమస్యలు చెప్పుకుంటున్నారు. 239వ రోజు జననేత పాదయాత్ర నర్సీపట్నం నియోజకవర్గంలోని ములగపూడి శివారు నుంచి ప్రారంభించారు. మెట్లపాలెం క్రాస్‌ మీదుగా బెన్నవరం చేరుకున్నారు. తమ కష్టాలు తెలుసుకునేందుకు వస్తున్న రాజన్న బిడ్డకు మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. రోడ్డుపై చీరలు పరిచి నడిపించారు. మధ్యాహ్నం తరువాత వైయస్‌ జగన్‌ బల్లిఘట్టంకు చేరుకుంటారు.  సాయంత్రం నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 


 
Back to Top