నీరాజనాలు


- విజ‌య‌వంతంగా  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 
- వైయ‌స్ జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం
- దారి పొడ‌వునా బాధ‌లు చెప్పుకుంటున్న ప్ర‌జ‌లు
- నేడు నిడదవోలులో బహిరంగ సభ
ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర‌గా బ‌య‌లు దేరిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడికి అడుగడుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. రాజ‌న్న బిడ్డ‌కు గ్రామ గ్రామాన ఘ‌న స్వాగ‌తం ల‌భిస్తోంది. గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. 184వ రోజు పాద‌యాత్ర శనివారం ఉదయం పెరవాలి నుంచి  ప్రారంభ‌మైంది. అక్కడి నుంచి మునిపల్లి, పెండ్యాల క్రాస్‌, కల్వచర్ల, డి ముప్పవరం, సమిశ్ర గూడెం మీదుగా నిడదవోలు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. నిడదవోలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు. 

క‌ష్టాలు వింటూ..క‌న్నీరు తుడుస్తూ..
పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు దారి పొడ‌వునా త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. ఎక్కడ చూసినా జనం.. జననేతను చూడాలని.. తమ అభిమాన నేతతో కరచాలనం చేయాలని.. కష్టాలు చెప్పుకుని భరోసా పొందాలని..  తమ కడగండ్లు తీర్చే నాయకుడొచ్చాడని.. తమ ఆశాదీపమే తమ చెంతకొచ్చిందని వారు సంబరపడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదని, పార్టీ వివక్ష చూపుతూ టీడీపీ వాళ్లు ఇళ్లు మంజూరు చేయడం లేదని, బంగారుతల్లి పథకాన్ని అటకెక్కించారని, ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడం లేదని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని.. ఇలా పలు వర్గాల ప్రజలు జననేతకు తమ కష్టాలు చెప్పుకొన్నారు. మనందరి ప్రభుత్వం రాగానే అందరికీ మేలు చేస్తామని వైయ‌స్‌ జగన్‌ వారికి ధైర్యం చెబుతున్నారు. జ‌న‌నేత‌ పాదయాత్ర ఆయా గ్రామాల గుండా ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతోంది.

ప‌శ్చిమ‌లో ఉప్పొంగిన అభిమానం
వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్ర మే నెల 13వ తేదీన పశ్చిమలోకి ప్రవేశించింది. ప్రారంభం నాటి నుంచి నేటి వ‌ర‌కు ఏ గ్రామానికి వెళ్లినా విశేష జ‌నాద‌ర‌ణ ల‌భించింది. రాజ‌న్న‌బిడ్డను చూసేందుకు, బాధ‌లు చెప్పుకునేందుకు ప్ర‌జ‌లు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చారు. ఈ జిల్లాలో ఇప్పటి వరకూ 11నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. దెందులూరు నియోజకవర్గం పెదఅడ్లగాడ గ్రామం వద్ద వైయ‌స్‌ జగన్‌ జిల్లాలోకి ప్రవేశించారు. అనంతరం ఏలూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఏలూరు వెంకటాపురం పంచాయతీ పరిధిలో జగన్‌ 2వేల కిలోమీటర్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం దెందులూరు, గోపాలపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఉండి, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు నియోజవకవర్గాల్లో పాదయాత్ర అప్రతిహతంగా సాగింది. వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చి వైయ‌స్ జగన్‌ పాదయాత్రకు నీరాజనాలు పలికారు.  జిల్లాలో 12వ నియోజకవర్గం నిడదవోలులో శనివారం జగన్‌ పాదయాత్రకొనసాగుతోంది. అనంతరం కొవ్వూరు నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతుంది.  
Back to Top