వైయస్‌ జగన్‌ సీఎం అయితేనే ప్రజలకు న్యాయం

బాబు పాలనంతా దోపిడీ, అరాచకం
చంద్రబాబు మళ్లీ నమ్మే ధైర్యం మాకులేదు
ప్రజా సంకల్పయాత్రలో కృష్ణా జిల్లా వాసులు
కృష్ణా: చంద్రబాబునాయుడు పాలన అంతా దోపిడీ, అరాచకం అని కృష్ణా జిల్లా పెనమలూరు వాసులు మండిపడుతున్నారు. కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్న వారంతా బాబు పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. చిన్న, సన్నకారు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర వస్తుందని ఆకాంక్షించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఇప్పటికే మూడు సార్లు మాట మార్చాడని, ఒకసారి హోదా అని, మరోసారి ప్యాకేజీ అని ఇప్పుడు మళ్లీ హోదా అంటూ ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబును నమ్మే ధైర్యం ఎవరికీ లేదన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం ఇవాళ్టికి బతికి ఉండటానికి కారకుడు వైయస్‌ జగన్‌ ఒక్కరే అన్నారు. నాలుగేళ్లుగా అనేక పోరాటాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని, వైయస్‌ జగన్‌తోనే హోదా వస్తుందని, మాకు ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువత ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
ప్రజలందరిలో చైతన్యం
వైయస్‌ జగన్‌ పాదయాత్ర ద్వారా గ్రామాల్లోని సమస్యలు అందరికీ తెలుస్తున్నాయని కృష్ణా జిల్లా వాసులు అంటున్నారు. పట్టణాల్లో ఉండే వారికి గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియడం లేదని, పాదయాత్ర ద్వారా ప్రజలందరిలో చైతన్యం వస్తుందన్నారు. 
 
Back to Top