అన్నొచ్చాడు


- ప్రకాశం జిల్లాలోకి ప్రజాసంకల్పయాత్ర
- వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం
- కొత్తపేటలో పార్టీ జెండా ఆవిష్కరించిన జ‌న‌నేత‌

ఒంగోలు: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా సాగుతోంది. శుక్ర‌వారం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రజా సంకల్పయాత్ర  ప్ర‌కాశం జిల్లాలోకి అడుగుపెట్టింది. కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం కొత్తపేట వద్ద జిల్లాలో పాదయాత్ర మొదలైంది. ఈ సందర్భంగా పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డితో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తలు, కార్యకర్తలు, అభిమానులు వైయ‌స్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ కొత్తపేటలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.  ప్రజాసంకల్పయాత్ర జిల్లాలో 9 నియోజకవర్గాల పరిధిలో 255 కి.మీ. మేర సాగనుంది. జగన్‌ యాత్రకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

రాజ‌న్న బిడ్డ కోసం..
చంద్ర‌బాబు నాలుగేళ్ల పాల‌న‌లో ఏ ఒక్క‌రు సంతోషంగా లేరు.  గత ఎన్నికల సమయంలో వందలాది హామీలిచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చక చంద్రబాబు సర్కారు ప్రజలను వంచించింది. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ రకరకాల హామీలిచ్చి అన్ని వర్గాలను మభ్యపెట్టారు. ఓట్లేయించుకొని గద్దెనెక్కి హామీలను తుంగలో తొక్కారు. బాబు వంచనతో రైతులు మహిళలు, నిరుద్యోగులు, వృద్ధులు, చేనేతలు, కార్మికులు అన్ని రకాల వారు దగా పడ్డారు. చంద్రబాబు సర్కారు వంచనను ఎండగట్టడమే కాక దగా పడిన బాధితులందరికీ తానున్నానంటూ భరోసా కల్పిస్తూ వైయ‌స్‌ జగన్‌ యాత్ర సాగుతోంది.  రాజ‌న్న బిడ్డ‌కు తమ బాధలు, కష్టాలు, కన్నీళ్లు చెప్పుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. రామాయపట్నం పోర్టు వస్తే వెనుకబడిన ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలకు మేలు జరుగుతుందని అందరూ ఆశ పడుతున్నారు. పోర్టు వస్తేనే పరిశ్రమలొచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలొస్తాయని ఎదురు చూస్తున్నారు.

స‌మ‌స్య‌ల మాల‌..
ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించేందుకు పాద‌యాత్ర‌గా వ‌చ్చిన వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌కాశం జిల్లా వాసులు స‌మ‌స్య‌ల మాల వేశారు. ఈ జిల్లాలో అనేక స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగా ఉన్నాయి. రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర లేదు. డ్వాక్రా సంఘాల‌కు రుణాలు అంద‌డం లేదు. విద్యార్థుల‌కు ఫీజులు రావ‌డం లేదు. ఉద్యోగులు  ప్ర‌భుత్వ నిరంకుశ విధానంతో న‌ష్ట‌పోతున్నారు. కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్‌ నీళ్లే దిక్కు కావడంతో ఫ్లోరోసిస్, కిడ్నీ వ్యాధుల బారినపడి వందలాది మంది మృత్యువాతపడుతున్నారు.గుక్కెడు మంచినీళ్ల కోసం వారు దోసిలొగ్గి వేడుకుంటున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే వరుస కరువులకు నిలయంగా మారిన పశ్చిమ ప్రకాశం కష్టాలు తీరతాయి. కానీ బాబు సర్కారు కనికరించడం లేదు. మిరప రైతులకు గిట్టుబాటు ధరల్లేక ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితి, నాగార్జున సాగర్‌ కుడికాలువ ఉన్నా వరి పంటకు నీళ్లిచ్చే పరిస్థితి లేదు. ఆరుతడి పంటలకు అంతంతమాత్రమే నీరు. వైయ‌స్‌ హయాంలో కొద్దిపాటి నీరున్నా పెద్ద మనసుతో నీళ్లిచ్చిన ఘనత ఆయనకే దక్కిం ది. చీరాల ప్రాంతంలో చేనేతల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముం దుకు రావడంలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో సవాలక్ష సమస్యలున్నా బాబు సర్కారు పట్టించుకోవడం లేదు. సమస్యలను వైయ‌స్ జగన్‌ దృష్టికి తెచ్చేందుకు జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. ఆయన భరోసా కోసం ఆశపడుతున్నారు.
Back to Top