కుక్క‌లవారి కండ్రిగ నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

చిత్తూరు:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లా  శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం కుక్కలవారి కండ్రిగ గ్రామం నుంచి ప్రారంభ‌మైంది. శ‌నివారం ఉద‌యం 66వ రోజు పాద‌యాత్ర‌ను కె.కండ్రిగ నుంచి ప్రారంభించిన వైయ‌స్ జ‌గ‌న్ అక్కడి నుంచి వెంకటాపురం క్రాస్, కుమ్మర మిట్ట, మోదుగు పాలెం క్రాస్, కొత్త వీరాపురం, అగ్రహారం, కంబాక, అంజిమీడు క్రాస్‌కు పాదయాత్ర చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఏర్పాడు, మేర్లపాక క్రాస్‌ మీదుగా చిందేపల్లి వరకు కొనసాగనుంది. కొత్తవీరాపురం, మేర్లపాక హరిజనవాడలో పార్టీ జెండాను వైయ‌స్ జగన్‌ ఆవిష్కరించనున్నారు.  
  

Back to Top