పండుగ పూట పెద్ద కొడుకువచ్చాడు

చిత్తూరు: భోగి పూట జననేత రాక పండుగ నాడు పెద్ద కొడుకు వచ్చినట్లుగా ఉందని నెన్నూరు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో భాగంగా నెన్నూరు గ్రామం చేరుకున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ముగ్గులు, గొబ్బెమ్మలతో స్వాగతం పలికారు. భోగి కంటే వైయస్‌ జగన్‌ మా గ్రామానికి రావడమే పెద్ద పండుగ అని ప్రజలంతా ఆనందం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపామన్నారు. చంద్రబాబు ఆయన కుటుంబంతో పండుగ చేసుకుంటుంటే.. వైయస్‌ జగన్‌ మాత్రం జనం మధ్యలో పండుగ చేసుకుంటున్నాడని, అందుకే ఆయన జననాయకుడు అయ్యాడని నెన్నూరు గ్రామ ప్రజలు అభిప్రాయపడ్డారు. 
 
Back to Top