ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం

 
–వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
కర్నూలు: ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గోవిందిన్నెలో వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని విద్యార్థి జేఏసీ నాయకులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా ఉద్యమకారులపై చంద్రబాబు అణచివేత ధోరణిని వైయస్‌ జగన్‌కు విద్యార్థి జేఏసీ నాయకులు వివరించారు. ప్రత్యేక హోదా ఏపీ హక్కంటూ ప్లకార్డు పట్టుకుని విద్యార్థులతో కలిసి వైయస్‌ జగన్‌ నడిచారు. హోదా కోసం ఉద్యమించిన వారిని నిర్భందించడం సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం తాను ఉద్యమించినట్లు విద్యార్థులకు వైయస్‌ జగన్‌ వివరించారు. అందరం కలిసి ఐక్యంగా ఉద్యమించి ప్రత్యేక హోదా సాధించుకుందామని జననేత పిలుపునిచ్చారు. వైయస్‌ జగన్‌ హామీతో విద్యార్థి జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top