అన్నొచ్చాడు..

- విజ‌య‌వంతంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
- కృష్ణా జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం
- జ‌న‌నేత‌తో క‌లిసి అడుగులో అడుగేస్తున్న వేలాది మంది ప్ర‌జ‌లు
- క‌ష్టాలు తెలుసుకుంటూ..భ‌రో్సా ఇస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌

కృష్ణా జిల్లా: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్ అన్ని వ‌ర్గాల‌కు భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. జ‌న‌నేత  అడుగులో వేలాది మంది ప్ర‌జ‌లు అడుగు వేస్తున్నారు... ఆత్మీయంగా పలకరిస్తున్నారు...తమ బిడ్డగా భావిస్తూ బాధలు చెప్పుకుంటున్నారు... వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి దారిపొడవునా అందరితో మమేకమవుతున్నారు...బాధలు తీరుస్తానని మాటిస్తున్నారు... అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నారు...వేసవి తీవ్రతను లెక్కచేయకుండా...అలసటా...విసుగూ లేకుండా జనం మధ్యలోనే సేదదీరుతూ పాదయాత్ర ప్రస్థానం కొనసాగిస్తున్నారు. 
 వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శనివారం 147వ రోజు నందమూర్‌ క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభమైంది. అక్క‌డి రాజుపేట, కాటూరు, కడవకొల్లు మీదుగా ఉయ్యూరు వరకు సాగనుంది. సాయంత్రం ఉయ్యూరులో వైయ స్‌ జగన్‌ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అడుగడుగునా ప్రజలు సమస్యలు తెలుసుకుంటూ.. వారి కష్టాలు ఉంటూ.. అండగా నేనున్నానని భరోసా ఇస్తూ వైయ‌స్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. ప్రతిచోట జననేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఊరులోనూ వైయ‌స్‌ జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. అధినేత నిబద్ధతతో కూడిన పోరాటం... నేతలు, కార్యకర్తల కార్యాచరణ  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహాన్నిస్తోంది. 

Back to Top