26 నుంచి చిత్తూరు జిల్లాలో వైయస్‌ జగన్‌ పాదయాత్రతిరుపతి: ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా  సాగుతోంది. నవంబర్‌ 6వ తేదీన వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభమైన వైయస్‌ జగన్‌ పాదయాత్ర వైయస్‌ఆర్‌ జిల్లా, కర్నూలు జిల్లాలో పూర్తి అయ్యింది. డిసెంబర్‌ 4వ తేదీ నుంచి అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఈ నెల 26వ తేదీ నుంచి చిత్తూరు జిల్లాలో వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమవుతుందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం పేర్కొన్నారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా ముఖ్య నేతలతో వైయస్‌ జగన్‌ పాదయాత్రపై చర్చించారు. తంబళ్లపల్లి, మదనపల్లి, పీలేరు, పుంగనూరు,పూతలపట్టు, జీడీ నెల్లూరు, చంద్రగిరి, నగరి, శ్రీకాకుళం నియోజకవర్గాల మీదుగా జననేత పాదయాత్ర కొనసాగుతుంది. చిత్తూరు జిల్లాలో 20 రోజుల పాటు దాదాపు 260 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరుగుతుందని, ఈ మేరకు రూట్‌ మ్యాప్‌ ఖరారు చేసినట్లు తలశీల రఘురాం తెలిపారు.
 
Back to Top