ప్రజలకు అండగా ప్రజాసంకల్పయాత్ర

  • పాదయాత్రకు అవరోధం సృష్టించేందుకు టీడీపీ కుట్ర
  • అసాంఘిక శక్తుల పట్ల వైయస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి
  • ఈనెల 6న పులివెందుల నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
  • వైయస్ఆర్ జిల్లాలో 7రోజుల పాటు 100కి.మీ మేర పాదయాత్ర
  • ప్రజాసంకల్పయాత్రను దిగ్విజయం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
  • వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం
విజయవాడః వైయస్సార్సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పాదయాత్రకు అవరోధాలు సృష్టించేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని..అసాంఘిక శక్తుల పట్ల వైయస్సార్సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సూచించారు. మూడున్నరేళ్లుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు, ప్రజలకు అండగా నిలబడాలన్న ధృడసంకల్పంతో వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని రఘురాం తెలిపారు. వైయస్ఆర్ పరిపాలనలో ప్రజలు ఏవిధంగా సుభిక్షంగా ఉన్నారో ఆ సువర్ణయుగాన్నిమళ్లీ తీసుకొచ్చేందుకు వైయస్ జగన్ చేపట్టిన సంకల్పయాత్రే ప్రజా సంకల్పయాత్ర అని రఘురాం అన్నారు. ఈనెల 6న వైయస్ జగన్ ఇడుపులపాయకు చేరుకొని మహానేత వైయస్ఆర్ సమాధి వద్ద నివాళుర్పిస్తారని, తదనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించాక ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. వైయస్ఆర్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో  100కి.మీ. మేర 7 రోజుల పాటు వైయస్ జగన్ పాదయాత్ర ఉంటుందని రఘురాం వెల్లడించారు.  పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లో ప్రజాసంకల్పయాత్ర ఉంటుందన్నారు. 

వైయస్ఆర్ తలపెట్టిన ప్రాజెక్ట్ లను టీడీపీ పూర్తి చేయడం లేదని, చేసిన వాటి నుంచి రైతులకు నీరు ఇవ్వకపోవడం లేదన్నారు. బాబు పాలనలో  ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగులు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితి ఏర్పడిందన్నారు. ఏపీ చరిత్రలో నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనను బాబు పాలనలోనే చూస్తున్నామన్నారు.  వైయస్ఆర్ గతంలో పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రజల కష్టాసుఖాలు తెలుసుకొని వారికి ఏవిధంగా మేలు చేశారో...అంతకంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేయాలన్న ధృడసంకల్పంతో వైయస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారన్నారు. ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేసేందుకు 13 జిల్లాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైయస్ జగన్ ఏ కార్యక్రమం చేపట్టిన శాంతియుత మార్గంలో, సమాజ దృక్పథంతోనే చేశారన్నారు. 
Back to Top