ప్రజా సంకల్పయాత్రకు మద్దతుగా పాదయాత్ర

ఎర్రగుంట్ల: వైయస్సార్‌సీపీ  అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6వ తేది నుంచి చేపట్టబోయే ప్రజా సంకల్పయాత్రకు మద్దతుగా జగన్‌ మహాసేన రాష్ట్ర అధ్యక్షుడు అల్లం సత్యం చేపడుతున్న పాదయాత్ర గురువారం ఎర్రగుంట్ల మండలానికి చెరుకుంది. ఈ పాదయాత్రకు చిలంకూరు గ్రామంలోనే వైయఎస్సార్‌ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జీ డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్ప యాత్రతో టీడీపీ నేతలలో వణుకు పుడుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ దాసరి సూర్యనారాయణరెడ్డి, ఎస్సీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, జిల్లా కార్యదర్శి జయరామక్రిష్ణారెడ్డి, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహుబూబ్‌ వలి, మండల కో–ఆప్షన్‌ సభ్యులు అబ్దుల్‌గఫూర్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top