- 12న పాదయాత్ర పునఃప్రారంభం- అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శతృచర్ల పరీక్షిత్‌రాజు
శ్రీకాకుళం : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 12న జిల్లాలో పునఃప్రారంభమవుతుందని, ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు పిలుపునిచ్చారు. పార్వతీపురంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో పాదయాత్రపై సమీక్షించారు. గతనెల మక్కువ మండలం పాయకపాడు వరకు కొనసాగిన పాదయాత్ర ఈ నెల 12న తిరిగి ప్రా రంభం అవుతందని, 13న పార్వతీపురం నియోజ కవర్గంలోనికి ప్రవేశించనున్న నేపథ్యంలో నియోజకవర్గం స్థాయిలో కార్యకర్తలు, అభిమానులు, నాయకులు, బూత్ కన్వీనర్లు సిద్ధంకావాలన్నారు.
పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిన తరువాత వైద్యుల సూచనలు, సలహాల మేరకు ఆరోగ్య పరంగా కొద్దిరోజులు పాటు విశ్రాంతి తీసుకున్న జగన్‌మోహన్‌రెడ్డి తిరిగి ప్రజల మధ్యకు రాబోతున్నారని తెలిపారు. ఆయనకు ఘన స్వాగతం పలకడానికి ప్రతీఒక్కరు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు వాకాడ నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు జమ్మాన ప్రసన్నకుమార్, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి గర్భాపు ఉదయభాను, సివిరిశెట్టి శ్రీనివాసరా వు, పట్టణ అధ్యక్షుడు కొండపల్లి బాలకృష్ణ, మం డల కన్వినర్ బోను రామినాయడు, ఫ్లోర్ లీడర్ మంత్రి రవికుమార్, అరకు పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంపల గుర్రాజు, జొన్నాడు శ్రీదేవి, యందవ నిర్మలాకుమారి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు