ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @2800 కి.మీ


 విశాఖ‌ : ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు సాంత్వన కలిగిస్తూ... వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే రాజన్న రాజ్యంలో ఎలాంటి మేళ్లు కలుగుతాయో వివరిస్తూ.. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్ర‌తిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో శుక్ర‌వారం మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.  ప్రజాసంకల్పయాత్ర  విశాఖ జిల్లా యలమంచిలి సమీపంలో 2,800 కిలోమీట‌ర్ల మైలురాయిని దాటింది.  244వ రోజు ప్రజాసంకల్పయాత్ర యలమంచిలి మండలం రేగుపాలెం జంక్షన్‌  నుంచి ప్రారంభ‌మైంది.  అక్క‌డి నుంచి లైన్‌ కొత్తూరు, రామకృష్ణాపురం, సోమన్నపాలెం, గాంధీపురం మీదగా వైయస్‌ జగన్‌ యలమంచిలి చేరుకుంటారు. అక్కడ సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.  వైయ‌స్ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 2800 కిలోమీటర్ల మైలురాయికి గుర్తుగా అక్కడ ఓ మొక్కను నాటారు. గ‌తేడాది న‌వంబ‌ర్ 6న ఇడుపులపాయ నుంచి  వైయ‌స్‌ జ‌గ‌న్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించారు. 




కిలోమీటర్ల వారీగా పాదయాత్రలో ఘట్టాలు 
2700 కిలోమీట‌ర్లు తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం (ఆగ‌స్టు 11, 2018)
2600 కిలోమీట‌ర్లు  తూర్పుగోదావరి జిల్లా జ‌గ్గంపేట నియోజకవర్గం(జూలై 28, 2018)
2500 కిలోమీటర్లు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం పులసపూడి వంతెన వద్ద (జులై 8, 2018)
2400 కిలోమీట‌ర్లు తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం ల‌క్క‌వ‌రం క్రాస్ వ‌ద్ద (జూన్ 21, 2018)
2300 పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని నందమూరు ‍క్రాస్‌ రోడ్డు వద్ద  2300 కిలోమీటర్లు(జూన్ 11, 2018).
2200 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుం నియోజకవర్గంలో రైల్వేగేటు దగ్గర (మే 30,2018)
2100 పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పిప్పర(మే 22,2018)
2000 పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నియోజకవర్గంలోని వెంకటాపురం (మే 14,2018)
1900- కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తాడంకి (ఏప్రిల్‌ 29, 2018)
1800- కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం గణపవరం (ఏప్రిల్‌ 18, 2018)
1700- గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం సుల్తానాబాద్‌ (ఏప్రిల్‌ 7,2018)
1600-గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు (మార్చి 27, 2018)
1500- గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ములుకుదూరు(మార్చి 14, 2018)
1400 - ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం  నాగులపాడు (మార్చి 5, 2018)
1300 - ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని నందనమారెళ్ల (ఫిబ్రవరి 25, 2018)
1200 - ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, రామ‌కృష్ణాపురం (ఫిబ్రవరి 16, 2018)
1100 - నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం, క‌లిగిరి (ఫిబ్రవరి 7, 2018)
1000 - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో పైలాన్‌ ఆవిష్కరణ (జనవరి 29, 2018)
900 - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చెర్లోపల్లి హరిజనవాడ (జనవరి 21, 2018)
800 - చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం నల్లవెంగనపల్లి (జనవరి 11, 2018)
700 - చిత్తూరు జిల్లా, పీలేరు నియోజకవర్గం చింతపర్తి శివారు (జనవరి 2, 2018)
600 - అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం కటారుపల్లి క్రాస్‌ రోడ్స్‌ (డిసెంబర్ ‌24, 2017)
500 - అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గం గొట్లూరు (డిసెంబర్‌ 16, 2017)
400 - అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం గుమ్మేపల్లి (డిసెంబర్‌ 7,2017)
300 - కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గం కారుమంచి (నవంబర్‌ 29, 2017)
200 - కర్నూలు జిల్లా, డోన్‌ నియోజకవర్గం ముద్దవరం (నవంబర్‌ 22, 2017)
100 - క‌ర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపం (నవంబర్‌ 14, 2017)
0 - వైయ‌స్‌ఆర్‌ జిల్లా, పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయ (నవంబర్‌ 6, 2017)  

తాజా వీడియోలు

Back to Top