ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @ 2600 కిలోమీట‌ర్లు

తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్రజాసంకల్ప యాత్రలో శ‌నివారం మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అశేష జనవాహిని వెంట నడువగా తూర్పుగోదావరి జిల్లా జ‌గ్గంపేట నియోజకవర్గంలో వైయ‌స్‌ జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర 2600 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వైయ‌స్‌ జగన్‌ గుర్తుగా అక్కడ ఒక మొక్కను నాటారు.2017 న‌వంబ‌ర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి వైయ‌స్‌ జ‌గ‌న్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా ఆయన జూన్‌ 12న తూర్పుగోదావరి జిల్లాలో అడుపెట్టారు. కాగా, ఇవాళ వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 222వ రోజు 100వ నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగుపెట్టింది.  


Back to Top