చిన్నారుల అభిమానం

తూర్పు గోదావరి:  చిన్నారుల అభిమానాన్ని కూడా వైయస్‌ జగన్‌ సొంతం చేసుకున్నారు. కైకోలుకు చెందిన వెంకటమోహనలక్ష్మీ అనే చిన్నారి తూరుపు కొండల్లో అనే పాటను అద్భుతంగా పాడి వైయస్‌ జగన్‌కు వినిపించింది.  అలాగే కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు వైయస్‌ జగన్‌తో అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. వైయస్‌ జగన్‌ తమ పిల్లలతో అక్షరాలు దిద్దించడం చూసి సంతోషపడుతున్నారు. వాతావరణం ఎలా మారినా.. జననేత ఖాతరు చేయ‌డం లేదు. ఎండవేడినీ, వానజడినీ పట్టించుకోలేదు. కష్టమైనా, నష్టమైనా చెక్కుచెదరని దీక్షాదక్షుడు ముందుకే సాగుతున్నారు. తడిసి ముద్దవుతున్నా సంకల్పసిద్ధితో ప్రతి క్షణం ప్రజలతో మమేకమయ్యారు. చెంతకు వచ్చిన వారి భుజంపై చేయి వేసి,  చిరునవ్వుతో పలకరిస్తూ,  ఆప్యాయంగా వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. పరిష్కారానికి భరోసానిస్తూ ముందుకు సాగారు.
జననేతను చూసి పల్లెలు ఉత్సాహంతో ఉప్పొంగిపోతున్నాయి. కష్టాలు తీర్చే ఆశల రేడు వచ్చాడని ప్రజలు సంబర పడుతున్నారు. ఆయనను.. నాలుగేళ్ల టీడీపీ ప్రజాకంటక పాలన నుంచి విముక్తి కల్పించేందుకు నడిచొస్తున్న నవరత్నంగా చూశారు. దారిపొడవునా    పూలు పరిచి, హారతి పట్టారు. ఆయనతో అడుగులేసేందుకు కదలివచ్చారు. వివిధ వర్గాల వారు ఆయనకు గోడు వెళ్లబోసుకున్నారు. జననేత ఇచ్చిన భరోసాతో ‘జయహో జగన్‌’ అంటూ నినదించారు.  ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. 
 
Back to Top