అన్నొస్తున్నాడు

 
- తూర్పు గోదావ‌రి జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర రూట్‌మ్యాప్‌ ఖరారు
- 16 నియోజకవర్గాలు, 270 కిలోమీటర్లు
 - రాజమహేంద్రవరంతో మొదలు తునితో ముగింపు

 
 రాజమహేంద్రవరం: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, జననేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ప్ర‌స్తుతం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న రాజ‌న్న బిడ్డ కోసం తూర్పు గోదావ‌రి జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. ఈ నాలుగేళ్లుగా తాము ప‌డుతున్న బాధ‌లు జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌కు చెప్పుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్రకు సంబంధించి జిల్లాలో రూట్‌ మ్యాప్‌ ఖరారైంది. ఈ నెల 9వ తేదీన ఏఏ గ్రామాల నుంచి పాదయాత్ర జరుగుతుందో వివరించే రూట్‌మ్యాప్ వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా విడుదల చేయనుంది. జిల్లాలో జరిగే పాదయాత్ర, రాజమహేంద్రవరం బ్రిడ్జిపై స్వాగత ఏర్పాట్లు, వివిధ కమిటీల ఏర్పాటుపై సోమవారం రాజమహేంద్రవరంలోని శ్రీ ఉమారామలింగేశ్వర కల్యాణ మండపంలో నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో ఉభయగోదావరి జిల్లాల రీజనల్‌ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా నేతలకు ర్యూట్‌ మ్యాప్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇటీవల వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అనారోగ్యం కారణంగా ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 11వ తేదీన పాదయాత్ర జిల్లాలోకి రాకపోవచ్చని, మరుసటి రోజు వచ్చే అవకాశం ఉందన్నారు. కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం బ్రిడ్జిపైకి మధ్యాహ్నం 3 లేదా 3:30 గంటలకు బయలుదేరుతారని తెలిపారు. జిల్లాలో వరుసగా రాజమహేంద్రవరం సిటీ, ధవళేశ్వరం(రాజమహేంద్రవరం రూరల్‌), రావులపాలెం (కొత్తపేట), పి.గన్నవరం, తాటిపాక (రాజోలు), అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం, రాయవరం(మండపేట), బిక్కవోలు (అనపర్తి), కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, సామర్లకోట (పెద్దాపురం), పిఠాపురం, కత్తిపూడి (ప్రత్తిపాడు), తుని నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.

మిగిలిన రాజానగరం, జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాల్లో పాదయాత్ర ముగిసిన తర్వాత బస్సు యాత్ర జరుగుతుందని చెప్పారు. 32 రోజులపాటు 270 కిలోమీటర్ల మేర జిల్లాలో పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రెండు లేదా మూడు రోజులపాటు పాదయాత్ర ఉంటుందని, ప్రతి నియోజవర్గంలో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. సభ జరిగే రోజు నియోజవర్గంలోని అన్ని మండలాల నుంచి ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని కో ఆర్డినేటర్లకు సూచించారు. జిల్లాలో వివిధ సామాజిక వర్గాలు, విద్యార్థి, ఉద్యోగ, రైతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించాలని పార్టీ నేతలు సూచించారు. ఇఫ్తార్‌ విందు జిల్లాలో ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ నియోజకవర్గంలో ఏ సమావేశం పెట్టాలో చర్చించాలని రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు కొయ్యె మోషేన్‌రాజు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, కురసాల కన్నబాబులకు సూచించారు.

విస్తృత ప్రచారం చేయండి...
ప్రజా సంకల్ప పాదయాత్రపై ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారీగా విస్తృతంగా ప్రచారం చేయాలని వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఫ్లెక్సీలు, కరపత్రాలు, ఆటోల్లో మైకుల ద్వారా విరివిగా ప్రచారం చేసి స్వాగతం, పాదయాత్రను నియోజకవర్గాల్లో విజయవంతం చేసుకోవాలని చెప్పారు. ఈ నెల 12వ తేదీన స్కూళ్లు తెరుస్తారని, స్వాగత జన సమీకరణకు వాహనాల కొరత ఉంటుందని, ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని కురసాల కన్నబాబు పేర్కొన్నారు. పార్కింగ్, భోజనం, మంచినీటికి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేద్దామని పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పేర్కొన్నారు. స్వాగతంతోపాటు పశ్చిమ గోదావరి నుంచి వీడ్కోలు ఘనంగా చెబుదామని కొయ్యె మోషేన్‌ రాజు పిలుపునిచ్చారు.

సమావేశంలో ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాటిశెట్టి రాజా, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, సీజీసీ సభ్యులు కుడుపూడి చిట్ట్టబ్బాయి, జక్కంపూడి విజయలక్ష్మి, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పెండెం దొరబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, జ్యోతుల చంటిబాబు, తోట సుబ్బారావునాయుడు, వేగుళ్ల లీలాకృష్ణ, సత్తి సూర్యనారాయణరెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అనంత ఉదయభాస్కర్, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, పొన్నాడ సతీష్‌కుమార్, పినిపే విశ్వరూప్, తానేటి వనిత, శ్రీనివాసనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు అల్లూరి కృష్ణంరాజు, దొమ్మేటి వెంకటేశ్వర్లు, పాముల రాజేశ్వరి, పార్టీ వివిధ విభాగాల, ముఖ్య నేతలు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, విప్పర్తి వేణుగోపాల్, కర్రి పాపారాయుడు, మిండగుదిటి మోహన్, మంతెన రవిరాజు, కసిరెడ్డి అంజిబాబు, నక్కా రాజబాబు, మేడపాటి షర్మిలారెడ్డి, పోలు విజయలక్ష్మి, గుర్రం గౌతమ్, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, మేడపాటి అనిల్‌రెడ్డి, కానుబోయిన సాగర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Back to Top