సడలని సంకల్పం


 

 
- దిగ్విజ‌యంగా కొన‌సాగుతున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
-  అస్వ‌స్థ‌త‌కు గురైనా లెక్క చేయ‌ని జ‌న‌నేత‌
- దారి పొడ‌వునా విన‌తుల వెల్లువ‌
- అండ‌గా ఉంటాన‌ని అన్ని వ‌ర్గాల‌కు రాజ‌న్న బిడ్డ భ‌రోసా

పశ్చిమగోదావరి : ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో పాద‌యాత్ర పూర్తి చేసుకొని ఈ నెల 14వ తేదీ నుంచి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. ప్రజా సంకల్ప పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. జననేతతో మాట్లాడేందుకు, ఆయనతో కష్టాలు చెప్పుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. యువకులు జగనన్నకు ఎదురేగి స్వాగతం పలుకుతున్నారు. ఆయనతో కరచాలనానికి, సెల్ఫీకి పోటీపడుతున్నారు. ఫలితంగా కిలోమీటరు యాత్ర సాగాలంటే గంటకుపైగానే సమయం పడుతోంది.  ప్రతిగ్రామంలోనూ వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలిసి ప్రజలు మండుటెండనూ లెక్కచేయక రోడ్లపైనే నిరీక్షిస్తున్నారు. జననేతను చూడాలని ఆత్రుత కనబరుస్తున్నారు. మేడలు, మిద్దెలు ఎక్కి గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. 

జ‌న సంక్షేమ‌మే ధ్యేయం
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోయినా, వడగాడ్పుకు అస్వస్థతకు గురైనా.. సడలని సంకల్పంతో జనక్షేమమే ధ్యేయంగా ముందడుగు వేస్తున్నారు. పండుగ‌లు, వేడుక‌లు జ‌నం మ‌ధ్యే చేసుకుంటూ, వారి మ‌ధ్య గ‌డుపుతున్నారు. మంగళవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి తలతాడితిప్ప, మెంతెపూడి క్రాస్‌, బొబ్బనపల్లి, మత్స్యపూరి, సీతారాంపురం క్రాస్ మీదగా కొప్పర్రు వరకూ వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది.  ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ ఉత్సాహంగా సాగుతోంది.  అడుగడుగునా ప్రజలు జననేతకు జయజయధ్వానాలు పలికారు. కష్టసుఖాలు పంచుకున్నారు.   దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్‌.రాజశేఖరరెడ్డి సువర్ణ పాలనను గుర్తుచేసుకుంటూ.. ఆయన తనయుడు వస్తే తమకు మేలు జరుగుతుందని, జగనన్నను ముఖ్యమంత్రిగా భావించి తమ సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. జననేత ఇచ్చిన భరోసాతో సంతృప్తిగా ఇళ్లకు వెళ్తున్నారు.  

తాజా వీడియోలు

Back to Top