ప్ర‌జా సంక‌ల్ప యాత్ర @ 1000 కిలో మీట‌ర్లు


- బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న ప్ర‌జ‌లు
- అన్ని వ‌ర్గాల‌కు భ‌రోసా క‌ల్పిస్తున్న జ‌న‌నేత‌
- వెంక‌ట‌గిరి వ‌ద్ద విజ‌య స్థూపం ఆవిష్క‌ర‌ణ‌

నెల్లూరు:  ప్రజాసంకల్ప యాత్ర దూసుకెళ్తోంది. లక్ష లాదిమంది ప్రజలతో మమేకమవుతూ లక్ష్యం వైపు కదులుతోంది. దుష్ట పాలనను అంత మొందించి రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు వేస్తున్న అడుగులు అధికార పక్షం నేతల్లో గుబులు రేపుతున్నాయి. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్‌కు బాటలే సేందుకు బహుదూరపు బాటసారి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేస్తోన్న ప్రజాసంకల్ప పాదయాత్ర  వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు అన్ని వ‌ర్గాల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. గ్రామ గ్రామాన జ‌న‌నేత‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతూ..త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్నారు. దారి పొడ‌వున ప్ర‌జ‌ల బాధ‌లు వింటున్న రాజ‌న్న అంద‌రికీ భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇడుపుల‌పాయ టూ సైదాపురం
 గతేడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర నవంబర్ 14న కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 100 కిలోమీటర్లు మైలురాయి - డోన్ నియోజకవర్గంలో 200 కిలోమీటర్ల మైలు రాయిని దాటిన 21వ రోజు పాదయాత్రలో భాగంగా జననేత జగన్ 300 కిలోమీటర్ల మైలు రాయిని కూడా కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గం బి.అగ్రహారం వద్ద పూర్తి చేసుకున్నారు. 29 రోజు పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా గుమ్మేపల్లిలో 400 కి.మీ మైలురాయిని చేరుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఉట్లూరు గ్రామంలో 500 కిలోమీటర్లు - డిసెంబర్ 24న అనంతపురం జిల్లా ఉట్లూరు వద్ద 600 కిలోమీటర్ల మైలు రాయిని దాటారు. ఇవాళ చిత్తూరు జిల్లా జమ్మివారిపల్లెలో 700 కిలోమీటర్లు పూర్తి చేశారు.చిత్తూరు జిల్లాలో 800 కిలోమీటర్ల మైలు రాయి దాటింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని చెర్లోపల్లి వద్ద ప్రజాసంకల్పయాత్ర 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా ప్ర‌తి వంద కిలోమీట‌ర్ల వ‌ద్ద  వైయ‌స్ జగన్ ఓ మొక్క‌ను నాటుతూ ముందుకు సాగుతున్నారు.  వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం సైదాపురం మండలంలో 1000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా సైదాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విజ‌య స్థూపాన్ని వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించారు. జ‌న‌నేత‌కు జిల్లా ప్ర‌జ‌లు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు.
Back to Top