జ‌న‌హార‌తి



- క‌రువు జిల్లాలో క‌న్నీళ్లు తుడుస్తున్న రాజ‌న్న బిడ్డ‌
- మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా
- నేడు ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌
 

 అనంత‌పురం: ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న వైయ‌స్ఆర్ సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగ‌డుగునా జ‌న‌నేత‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వైయ‌స్ జగన్‌కు మహిళలు హారతులతో ఆత్మీయ స్వాగ‌తం ప‌లుకుతున్నారు. జ‌గ‌న‌న్న‌తోనే రాజన్న రాజ్యం వస్తుందంటూ ఉత్సాహంతో ప్రజలు యాత్రకు మద్ధతుగా నిలుస్తున్నారు. దారిపోడువునా త‌మ బాధ‌లు చెప్పుకుంటూ జ‌న‌నేత‌తో అడుగులో అడుగువేస్తున్నారు. ప్రజలతో మమేకవుతూ ముందుకు సాగుతోన్న జననేత జగన్ పాదయాత్రలో భాగంగా ఆదివారం 31వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం మార్తాడు గ్రామం నుంచి ప్రారంభ‌మైంది.  10.30 గంట‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగుపెడుతోంది. 

క‌దిలిస్తే క‌న్నీళ్లు.. 
ప్రతీపల్లె... ప్రతీ మదీ..కదిలిస్తే కన్నీటి జడులే! ప్రభుత్వ తీరుతో మోసపోయామని ఒకరు.. చావు బతుకుల మధ్య ఉన్నా చికిత్స అందడం లేదని ఇంకొకరు.. అర్హత ఉన్నా వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతి పరులమని పింఛన్‌ ఇవ్వలేదని మరొకరు.. ఇలా ప్రతీ మనిషి తమ అభిమాన నేత వైయ‌స్‌ జగన్‌ ముందు సమస్యలు ఏకరువు పెడుతున్నారు.  అండగా నిలవాల్సిన ప్రభుత్వాలే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే బతికేదెట్టాగని బోరుమన్నారు. వారందరినీ వైయ‌స్ జగన్‌ అక్కున చేర్చుకుని ఓదార్చారు. అండగా ఉంటామని ధైర్యం చెబుతూ ముందుకు సాగారు.  

పూల‌బాట‌..స‌మ‌స్య‌ల మూట‌
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా త‌మ గ్రామానికి వ‌చ్చిన జ‌న‌నేత‌కు పాపినేనిపాళ్యం గ్రామస్తులు బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి హారతి పట్టారు. తమ అభిమాన నేతను పూలపై నడిపించారు. చీమల శివ అనే రైతు నాగలి బహుకరించారు. ఎల్లమ్మ అనే వృద్ధురాలొచ్చి ‘అయ్యా.. మా ఇంటాయన చనిపోయినాడు. వితంతువు పింఛను ఇవ్వలేదు. నా వయస్సు 70 ఏళ్లు కనీసం వృద్ధాప్య పింఛనూ ఇవ్వలేదు. కొడుకు చూస్తే.. ‘నాకు సంబంధం లేదు. నీ బతుకు నువ్వే బతుక్కోపో’ అంటున్నాడు. ఎట్టా బతికేదని బోరున విలపించింది. శింగనమల మండలం లోలూరులో 90 సెంట్ల స్థలంలో దళితులు గుడిసెలు వేసుకుని బతుకుతున్నామని, ఎమ్మెల్యే యామినీబాల వాటిని కబ్జా చేసి అనుచరులకు ఇచ్చేందుకు యత్నిస్తోందని అక్కడి దళితులు మూకుమ్మడిగా ఆరోపించారు. కల్లు గీత కార్మికుల కోసం ఫెడరేషన్‌ ఏర్పాట చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకూ పైసా కేటాయించలేదని కల్లు గీత కార్మిక సంఘం నేతలు వైయ‌స్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు.   దారి పొడవునా మహిళలు, విద్యార్థులు వైయ‌స్ జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.   ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందిగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) విధానాన్ని రద్దు చేస్తామని ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) నాయకులు అన్నారు. ఈ మేరకు వారు వైయ‌స్‌ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు హైకోర్టు న్యాయ‌వాదులు సంఘీభావం తెలిపారు. ఇలా అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తుతో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర విజ‌య‌వంతంగా సాగుతోంది. త‌న‌ను క‌లిసిన ప్ర‌తి ఒక్క‌రికి వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.  


Back to Top