రాష్ట్రంలో న్యాయం లేదు..ధర్మం లేదు

 

–  గ్రామ గ్రామాన అవినీతే   
– జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను తయారు చేశారు
– చివరికి గుడి భూములను కూడా వదలడం లేదు
– ఆడియో, వీడియో టేపుల్లో దొరికినా బాబుlరాజీనామా చేయడం లేదు
– రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారే తూట్లు పొడుస్తున్నారు
– జేసీ సోదరులు పట్టపగలే హత్యలు చేయిస్తూ..సాక్షులను కూడా బెదిరిస్తున్నారు
– దారుణమైన పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు
– నవరత్నాల్లో మార్పు చేర్పులకు మీరందరూ సలహాలు, సూచనలు ఇవ్వండి


అనంతపురం:  రాష్ట్రంలో న్యాయం..ధర్మం లేదని, దారుణమైన చంద్రబాబు పాలనలో ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరన్నారు. ప్రత్యేక విమానాల్లో చంద్రబాబు విదేశీ యాత్రలు చేయడం తప్ప రాష్ట్రానికి ఎలాంటి మేలు జరుగడం లేదన్నారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు, అందరికి న్యాయం చేసేందుకు పోరాడుతున్న తనకు ప్రతి ఒక్కరు తోడుగా నిలవాలని వైయస్‌ జగన్‌ కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 27వ రోజు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర ్గంలోని పెద్ద వడుగూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేష జనవాహిణిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

మనల్ని మనం ప్రశ్నించుకోవాలి..
నాలుగేళ్ల టీడీపీ పాలన చూసిన తరువాత, మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని తెలిసిన పరిస్థితుల్లో మనందరం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనకు ఎలాంటి నాయకుడు కావాలని మనమంతా అడుక్కోవాలి. మోసం చేసే నాయకుడు మనకు కావాలా అని మనల్ని మనం అడగాలి. అబద్దాలు చెప్పే నాయకుడు కావాలా?. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మనం చూసింది ఇదే. రాష్ట్రంలో న్యాయం లేదు. ధర్మం లేదు. ఇసుక నుంచి మట్టి, మద్యం, కాంట్రాక్టర్లు, బోగ్గు, రాజధాని భూముల దాకా, చివరికి గుడి భూములు కూడా వదలడం లేదు. ఈ అవినీతి చంద్రబాబు స్థాయి నుంచి మొదలై గ్రామ గ్రామానా సాగుతోంది. జన్మభూమి కమిటీ పేరుతో ఒక మాఫియాను తయారు చేశారు. పింఛన్లు కావాలన్నా వీరికి లంచాలు ఇవ్వాలి, చివరకు మరుగుదొడ్డి కావాలన్నా వీరికి లంచం ఇవ్వాలి

నాలుగేళ్లలో చంద్రబాబు చేసింది ఏంటీ?
నాలుగేళ్ల క్రితం ఇదే పెద్ద మనిషి ఏమన్నారు. కరెంటు బిల్లులు విఫరీతంగా షాక్‌ కొడుతున్నాయి. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. నాలుగేళ్ల క్రితం మనకు రూ.50, 60 కరెంటు బిల్లు వచ్చేది. ఇవాళ నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో కరెంటు బిల్లు రూ.500, వెయ్యి వస్తోంది.
ప్రతి పేద వాడికి మూడు సెంట్ల స్థలం, పక్కాఇల్లు కట్టిస్తానని చంద్రబాబు అన్నాడు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను..ఒక్క ఇల్లైనా కట్టించాడా?. దారుణంగా మోసం చేశాడు. నాలుగేళ్ల కిందట మనం రేషన్‌ షాపుకు వెళ్తే బియ్యం, కందిపప్పు, కిరోసిన్, చక్కెర వంటి 9 రకాల సరుకులు ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యం తప్ప వేరే సరుకులు ఇవ్వడం లేదు.

గ్రామాల్లో మాల్స్‌ పెడతారట..

ఇటీవల పేపర్లో చూశాను. గ్రామాల్లో మాల్స్‌ పెడతారట. రిలయన్స్‌ సంస్థలకు రేషన్‌ షాపులు అప్పగించి మాల్స్‌ పెట్టిస్తారట. అక్కడ 20 శాతం సబ్సిడీ ఇస్తారట. పూర్వం రేషన్‌ షాపుల్లో 60 శాతం సబ్సిడీకి ఇచ్చేవారని చంద్రబాబుకు తెలియదా. నీ సంస్థకు భాగం ఉన్న ప్యూచర్‌ గ్రూపులకు ఈ మాల్స్‌ ఇవ్వనున్నారు. 

ఒక్క హామీ అయినా నెరవేర్చారా?
 జాబు రావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ.2 వేలు ఇస్తామని మాట ఇచ్చారు.దాదాపు 45 నెలలుగా చంద్రబాబు ప్రతి ఇంటికి రూ.90 వేలు బాకీ పడ్డారు. ఇదే పెద్ద మనిషి సీఎ కూర్చిలో కూర్చునేందుకు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలన్నారు. వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ కావాలంటే బాబు రావాలన్నారు. నాలుగేళ్ల తరువాత మీ బంగారం ఇంటికి వచ్చిందా?  బంగారం ఇంటికి రాలేదు సరి, నోటీసులు ఇంటికి వస్తున్నాయి. బాబు చేస్తున్న రుణమాఫీ కనీసం వడ్డీలకు సరిపోవడం లేదు. పొదుపు సంఘాల అక్క చెల్లమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యాయా అని అడుగుతున్నాను. సున్నా వడ్డీకి గతంలో రుణాలు అందేవి. చంద్రబాబు వడ్డీ లెక్కలు ఆపడం  వల్ల బ్యాంకులు రెండు రూపాయల వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ప్రతి కులానికి మాట చెప్పి మాట తప్పాడు. కులం కులాన్ని మోసం  చేశాడు . 

రైతుల పరిస్థితి దారుణం
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. రూ.5 వేల కోట్లతో ధరల స్థీరికరణ నిధి ఏర్పాటు చేస్తానని బాబు చెప్పాడు. ఇవాళ పత్తి పంటకు గిట్టుబాటు ధర ఉందా?. రూ.3500 క్వింటాల్‌కు కొనే నాథుడు లేడు. వేరు శనగకు గిట్టుబాటు ధర లేదు. రూ.3 వేలకు అడిగే నాథుడు లేడు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు తాను ఉద్యోగాలు ఇప్పించలేకపోయారు. ఉద్యోగాలు వచ్చే ప్రత్యేక హోదాను తీసుకురాలేకపోయారు. ఎన్నికలప్పుడు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అన్నారు. ఇవాళ చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకువచ్చాడా? ప్రత్యేక హోదాను ఆయన స్వార్థం కోసం అమ్మేశారు. 

ప్రతి ఇంటికి కేజీ బంగారం..విమానం ఇస్తామంటాడు
ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు చూసిన తరువాత మిమ్మల్ని అడుగుతున్నాను. రేపు  ఇలాంటి నాయకుడు కావాలా? ఇలాంటి నాయకుడ్ని మనం క్షమిస్తే..రేపొద్దున ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. ప్రతి ఇంటికి విమానం కొనిస్తానని చెబుతాడు. ఈ రాజకీయాలు మారాలి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనే పదానికి అర్థంతీసుకురావాలి. చెప్పిన మాట నెరవేర్చకపోతే ఆ నాయకుడు ఇంటికి వెళ్లాలి. రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు నాకు తోడుగా మీరందరు నిలబడాలి. అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుంది.

ఏ ప్రాజెక్టు చూపినా నీళ్లు లేవు
తాడిపత్రిలో చాగల్లు, పెండెకల్‌ ప్రాజెక్టులు మహానేత పాలనలో కట్టారు. ఆ ప్రాజెక్టులు చంద్రబాబు కనీసం నీటి అలాట్‌మెంట్‌ చేయలేదు. ఏ ప్రాజెక్టు చూసినా కూడా నీరు లేదు. హెచ్‌ఎల్‌సీలో నీరు లేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏడాదికి ఐదు నెలల పాటు నీరు పారేది. ఇవాళ రెండు నెలలు కూడా నీరు పారడం లేదు. హంద్రీనీవా ప్రాజెక్టుతో జిల్లాను  మహానేత సస్యశ్యామలం చేయాలని ప్రయత్నించారు. ఈ ప్రాజెక్టును చంద్రబాబు పట్టించుకోవడం లేదు. మిగిలిన 20 శాతం పనులు పూర్తి చేయడం లేదు. పిల్ల కాల్వలు తవ్వితే లక్ష 25 వేల ఎకరాలకు నీరు ఇవ్వవచ్చు.

ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి
చంద్రబాబు ఇవాళ సౌత్‌ కోరియాలో ఉన్నారట. ఆయనకు విశ్రాంతి కావాల్సివస్తే విదేశాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నారు. ఆయన కొత్త పరిశ్రమలు తీసుకురావడం దేవుడెరుగు, ఉన్న ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయి. ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీల పరిస్థితి ఏంటి. బాబు సీఎం అయ్యాక విఫరీతంగా కరెంటు బిల్లులు పెంచారు. రాయల్టీ రెండింతలు పెంచడంతో పరిశ్రమలు మూతపడ్డాయి. అసలు ఈ మనిషికి బుద్ధీ, జాన్ఞ ం ఉందా. చేసేవన్నీ కూడా వేదవ పనులు, అన్యాయమైన పనులే. ఇవాళ కడుపు నింపుకునేందుకు పేదలు అవస్థలు పడుతున్నారు. సౌత్‌ కోరియాకు వెళ్లి మీరు రండి అని పిలుస్తున్నారు. ఎవరు వస్తారు మిమ్మల్ని చూసి.

పట్ట పగలే హత్యలు
తాడిపత్రి నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సాక్ష్యాత్తు సింగిల్‌ విండో చైర్మన్‌ను ఆఫీస్‌లోనే చంపేశారు. అంతమంది సమక్షంలో ఆ మనిషిని చంపేస్తే, సాక్ష్యాలు ఇస్తారని దారుణంగా బెదిరిస్తున్నారు. వారు నా వద్దకు వచ్చి ఫోటోలు చూపించారు. వారి పొలాలను దున్నేస్తున్నారు. ఇల్లు కూల్చేస్తున్నారు. బోర్లను పూడ్చి వేస్తున్నారు. ఇంతటి దారుణంగా బయపెడుతున్నారు. పూడ్చిన బోర్లు మళ్లీ తవ్వుకునేందుకు అవకాశం  ఇవ్వండి అని తహశీల్దార్‌ను కోరితే ఆయన ఎమ్మెల్యే వద్దకు వెళ్లమని చెబుతున్నారు. 

దారుణమైన పాలన
పట్టపగలే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. వారిపై అనర్హత వేటు వేయరు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వీల్లే తూట్లు పొడుస్తున్నారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో లంచాలు ఇస్తూ చంద్రబాబు ఆడియో, వీడియో టేపులతో దొరికిపోతే ఇంతవరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోరు. ఈ ముఖ్యమంత్రి రాజీనామా చేయడు. కేసులు కూడా కొట్టి వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతటి దారుణమైనపాలనలో ప్రజలు ఉన్నారు. ఇదే జిల్లాలో 65 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

ప్రతి ఒక్కరికి తోడుగా ఉండేందుకే..
చంద్రబాబు పాలనలో మోసపోయిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండేందుకే పాదయాత్ర చేపట్టానని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. రైతులకు తోడుగా ఉండేందుకు పాదయాత్ర చేపట్టాను. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు భరోసా కల్పించేందుకు, చదువుకుంటున్న పిల్లలకు తోడుగా ఉండేందుకు పాదయాత్ర మొదలుపెట్టాను. దారి పొడువునా ఈ పాదయాత్రలో తోడుగా ఉండండి, సూచనలు ఇవ్వండి.  మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చేసే మంచి పనులు చేసేందుకు నవరత్నాలు ప్రకటించాం. అందులో మార్పులు, చేర్పులు చేసేందుకు సలహాలు ఇవ్వమని కోరుతున్నాను. 

వాడుకోవడం..వదిలేయడం చంద్రబాబు నైజం
బీసీలను వాడుకోవడం. వదిలిపెట్టడం చంద్రబాబు నైజమని వైయస్‌ జగన్‌ విమర్శించారు. నాలుగు కత్తెర్లు ఇస్తే బీసీలపై ప్రేమ ఉన్నట్టా? నిజంగా బీసీలకు తోడుగా ఉండింది మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరే. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పేదరికం నిర్మూలనకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదవాళ్లు ఉన్నత చదువులు చదివిందుకు ఫీజులు చెల్లించారు. ఇవాళ ఇంజనీరింగ్‌ చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతోంది. ప్రభుత్వం ఇచ్చేది ముష్టి వేసినట్లు రూ.35 వేలు ఇస్తున్నారు. మిగిలిన డబ్బులు తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తెస్తారు. ఇవాళ మన పిల్లలను చదివించే పరిస్థితి ఉందా?. 

ఇదీ బీసీలపై ప్రేమంటే..
మీ పిల్లలను నేను చదివిస్తానని వైయస్‌ జగన్‌ గర్వంగా చెప్పారు. చదువుకునే విద్యార్థులకు పూర్తి ఫీజులు కట్టడమే కాదు. మెస్‌ చార్జీలు, హాస్టల్‌ చార్జీల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇస్తాను. నాన్నగారు ఒక్క అడుగు ముందుకు వేశారు. ఆయన కొడుకుగా నేను మరో రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. ప్రతి పిల్లాడిని బడికి పంపిస్తే..ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ఆ పిల్లలు బడికి వెళ్లి ఇంజనీర్లు, డాక్టర్లు కావాలి. ఇది బీసీలపై ఉన్న ప్రేమంటే. 

నాలుగు విడతల్లో డ్వాక్రా రుణాలు మాఫీ
దారి పొడువునా అక్కచెల్లమ్మలను కలిశానని వైయస్‌ జగన్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయారు. ప్రతి అక్కా చెల్లమ్మకు నేను చెబుతున్నాను. ఎన్నికల నాటి వరకు పొదుపు సంఘాలకు ఎంత అయితే అప్పులు ఉంటాయో ఆ డబ్బంతా మీ చేతికి నాలుగు విడతల్లో ఇస్తాం. వడ్డీ లేని రుణాలు కావాలని అక్కా చెల్లెమ్మలు కోరుతున్నారు. మీకిచ్చే సొత్తు మీకే ఇస్తాం. బ్యాంకులకు సంబంధించి వడ్డీ లెక్కలు కూడా నేరుగా కడుతామని చెబుతున్నాను. తోడుగా నిలవండి అని కోరుతున్నాను.

హైదరాబాద్‌ వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదట..
ఆరోగ్య శ్రీ పరిస్థితి రాష్ట్రంలో దారుణంగా మారింది. పాదయాత్రలో చాలా మంది పిల్లలు, తల్లులు నా వద్దకు తీసుకొని వచ్చారు. హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు. నారాలకు సంబంధించి పెద్ద ఆపరేషన్‌చేయాలంటే హైదరాబాద్‌కు వెళ్తాం.  ఆరోగ్య శ్రీ పేషేంటు హైదరాబాద్‌కు వెళ్తే డబ్బులు ఇవ్వడం లేదట. దాదాపు 8 నెలల నుంచి ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వడం లేదు. కిడ్నీలు బాగలేకపోతే డయాలసిస్‌ చేసుకోవాలంటే వారానికి రూ.2 వేలు ఖర్చు అవుతుంది. వారంలో రెండు మూడు సార్లు చేయించుకోవాల్సి వస్తుంది. అలాంటి కి డ్నీ షేషేంట్లకు డయాలసిస్‌ చేయడం లేదు. మూగ, చెవుడు ఉన్న పిల్లలకు కాంక్లీయర్‌ ఇన్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌ చేయడం లేదు. క్యాన్సర్‌ పేషేంట్లకు కీమో థెరఫీ చేయాలంటే ఏడాదికి ఆరు లక్షలు ఖర్చు అవుతుంది. ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం రెండు, మూడుసార్లు మాత్రమే కీమో థెరఫీ చేస్తున్నారు. ఇవాళ 108 సకాలంలో రావడం లేదు. 108 వాహనానికి డీజిల్‌ లేదు. వేతనాలు ఇవ్వడం లేదు కాబట్టి ధర్నాలో ఉన్నామన్న సమాధానాలు వస్తున్నాయి. 104 వాహనం ద్వారా దీర్ఘకాలిక రోగులకు మందులు ఇవ్వడం లేదు. ఇంత దారుణమైన ఆరోగ్యశ్రీని నవరత్నాల్లో చేర్చాము. రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. వెయ్యి రూపాయలు బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ కింద చేర్చి ఉచితంగా వైద్యం చేయిస్తాం. ఆపరేషన్‌ అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకునే రోగులకు కూడా డబ్బులు ఇస్తామని చెబుతున్నాను. కిడ్నీ పేషేంట్లకు నెలకు రూ.10 వేల పింఛన్‌ ఇస్తాం. ఆపరేషన్‌ చేయించుకునేందుకు మీరు ఎక్కడికి వెళ్లినా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని హామీ ఇస్తున్నాను. డెంగ్యూ జ్వరం వస్తే రూ.30 వేలు ఖర్చు అవుతోంది. ఇలాంటి జ్వరాలతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు మార్చేందుకు ఆరోగ్యశ్రీని మెరుగు పరుస్తాం. నవరత్నాల్లో మార్పులు, చేర్పులకు సంబంధించి ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే మీరంతా నావద్దకు రావచ్చు. దారి పొడువునా నన్ను కలువవచ్చు. మీరు చూపించిన ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ..సెలవు తీసుకుంటున్నాను.
 
Back to Top