అభిమాన సంద్రం



- క‌ర్నూలు జిల్లాలో దిగ్విజ‌యంగా సాగుతున్న పాద‌యాత్ర 
- జ‌న‌నేత‌కు అడుగ‌డుగునా ఘ‌న స్వాగ‌తం
- దారి పొడువునా స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్న జ‌నం
- 16వ రోజు ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌

కర్నూలు :  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు క‌ర్నూలు జిల్లాలో విశేష స్పంద‌న ల‌భిస్తోంది. అడుగ‌డుగునా జ‌న‌నేత‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. రాజ‌న్న బిడ్డ వ‌స్తున్నారంటే చాలు జ‌నం ప‌నులు మానుకొని ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఎటు చూసినా జ‌న‌మే జ‌నం. వైయస్ జ‌గ‌న్ పాద‌యాత్ర అభిమాన సంద్రంగా మారుతోంది. వేలాది మంది ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో పాల్గొంటూ ప్ర‌తిప‌క్ష నేత‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. ఈ నెల 6వ తేదీన ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ఈ నెల 14వ తేదీ నుంచి క‌ర్నూలు జిల్లాలో కొన‌సాగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆళ్ల‌గ‌డ్డ‌, బ‌న‌గాన‌ప‌ల్లె, డోన్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించిన వైయ‌స్ జ‌గ‌న్ నిన్న సాయంత్రం ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగుపెట్టారు. దీంతో జ‌న‌నేత‌కు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. 16వ రోజు పాద‌యాత్ర ఉదయం ఆయన వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌ రోడ్డు నుంచి ప్రారంభ‌మైంది. ఈ పాద‌యాత్ర‌ రామల్లెపల్లె మీదుగా బోయినపల్లి క్రాస్‌ రోడ్డు చేరుకుంటుంది.  అక్కడి నుంచి నడక కొనసాగిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు రత్నపల్లి క్రాస్‌రోడ్డుకు వైయ‌స్ జ‌గ‌న్‌ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభం అవుతుంది. ప్రజలతో మమేకమవుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాయంత్రం 5 గంటలకు వెల్దుర్తి చేరుకుంటారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు వైయ‌స్ జగన్‌ బస చేస్తారు.

గంట‌ల త‌ర‌బ‌డి నిరీక్ష‌ణ‌
 వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పాద‌యాత్ర‌కు జ‌నం అధిక సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి స‌మ‌స్య‌లు చెప్పుకుంటుండ‌టంతో అనుకున్న స‌మ‌యం కంటే ఆల‌స్యంగా యాత్ర సాగుతోంది. జ‌న‌నేత‌కు త‌మ సమస్య చెప్పుకుంటే పరిష్కారమవుతుందన్న నమ్మకం వల్లే  ప్రజా సంకల్పం పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది మంది తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వైయ‌స్ జగన్‌ను కలసి తమ బాధలు చెప్పుకుంటే అవి తీరుతాయన్న భరోసాతో గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. సంక్షేమ పథకాలు అందడం లేదని.. అనారోగ్యంతో ఉన్న తమకు ఆరోగ్య శ్రీ వర్తించలేదని.. పిల్లల భవిష్యత్‌ అంధకారమయం అవుతోందని.. ఉద్యోగం నుంచి తొలగించారని.. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని.. ఇలా ఒకరిద్దరు కాదు.. అన్ని వర్గాల వారూ పాదయాత్రలో ప్ర‌తిప‌క్ష నేత‌ను కలిసి కష్టాలు చెప్పుకుంటున్నారు. పక్షం రోజుల్లోనే వందలాది వినతులు వచ్చాయంటే అది వైయ‌స్ జగన్‌పై ఉన్న నమ్మకమేనని, ఆయన ఇస్తున్న భరోసాయే కారణమని స్పష్టమవుతోంది. ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి వైయ‌స్ జగన్‌ను కలుసుకుంటున్నారు. సమస్యలు చెప్పుకుంటూ వినతిపత్రాలు ఇస్తున్నారు. దానర్థం వారి బాధలు వినడానికి ఒక మనిషి ఉన్నాడని నమ్మడమే. ఆ మనిషి రేపు అధికారంలోకి వచ్చినపుడు తమ సమస్యలు పరిష్కరిస్తాడని విశ్వసించడమే.

చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి మోస‌పోయాం
వైయ‌స్ జ‌గ‌న్ ఏ గ్రామానికి వెళ్లినా ప్ర‌జ‌లు చంద్ర‌బాబు మోసాల‌ను వివ‌రిస్తున్నారు. ఎన్నిక‌ల ముందు చంద్ర‌బాబు మాట‌లు న‌మ్మి ఓట్లు వేస్తే అధికారంలోకి వ‌చ్చాక మోసం చేశార‌ని వాపోతున్నారు. పంట రుణాలు మాఫీ కాలేద‌ని కొంద‌రు, పింఛ‌న్ రావ‌డం లేద‌ని మ‌రికొంద‌రు, ఆరోగ్య‌శ్రీ అంద‌డం లేద‌ని ఇంకొంద‌రు, ఫీజులు రావ‌డం లేద‌ని విద్యార్థులు ఇలా త‌మ బాధ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌కు విన్న‌విస్తున్నారు.  
ప్రతీ అంశంలో ఎంతో స్పష్టత  వైయ‌స్ జగన్‌ పాదయాత్రలో ఒక్కొక్క అడుగూ వేసే కొద్దీ దారిపొడవునా వెల్లువలా సామాన్య ప్రజానీకం ఎదురొస్తున్నారు. అభిమానంతో స్వాగతం పలకడంతో పాటుగా తమ సమస్యలను ఆయన దృష్టికి తెస్తున్నారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో తాము ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్ష నేతకు ప్ర‌జ‌లు  నివేదిస్తున్నారు.  
 

  

తాజా వీడియోలు

Back to Top