నీరాజ‌నాలు


- జేజేలు కొట్టిన జ‌నం
-ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్టిన జ‌న‌నేత‌

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. అన్నవస్తున్నాడంటూ జేజేలు కొడుతున్నారు. ఈ నెల 6వ తేదీన ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ఈ నెల 14వ తేదీ నుంచి క‌ర్నూలు జిల్లాలో కొన‌సాగుతోంది. ఈ నెల ఈ నెల 20వ తేదీ నుంచి డోన్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌నేత చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంత‌మైంది. ఇవాళ సాయంత్రం ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో యాత్ర ముగించుకొని ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగుపెట్టారు.  ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 13వ రోజు సోమ‌వారం సాయంత్రం కర్నూలు జిల్లా డోన్ నియోజ‌క‌వ‌ర్గంలోకి రాజ‌న్న బిడ్డ అడుగు పెట్టారు. ఆ రోజు సాయంత్రం గొర్ల‌గుట్ట గ్రామంలో క్వారీ కార్మికుల‌తో ముఖాముఖి నిర్వ‌హించి వారిస‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. 14వ రోజు మంగళవారం డోన్‌ నియోజకవర్గంలోని బేతంచర్ల మండలం గోరుగుట్ల నుంచి ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి షైక్‌ షా వలీ దర్గాను ద‌ర్శించుకున్నారు. అనంత‌రం బేతంచ‌ర్ల ప‌ట్ట‌ణానికి చేరుకున్నారు.  మధ్యాహ్నం 3.30 గంటలకు బేతంచర్ల బస్టాండ్‌ సర్కిల్‌ లో నిర్వహించే బహిరంగ సభకు వేలాది జ‌నం త‌ర‌లివ‌చ్చారు.. రాజన్న తనయుడిని చూసేందుకు తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో బేతంచర్ల బస్టాండ్‌ సర్కిల్‌ పోటెత్తింది. రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా జనమే కనిపించారు. భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి వైయ‌స్‌ జగన్‌ చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. అన్ని వ‌ర్గాల్లో ధైర్యాన్ని నింపింది. సాయంత్రం 6 గంటలకు తిరిగి కోలుములెపల్లి చేరుకొని.. పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి తన 15వ రోజు ప్రజాసంకల్పయాత్రను బుధవారం ఉదయం డోన్‌ నియోజకవర్గం బేతంచర్ల మండలం కొలుములుపల్లి నుంచి ప్రారంభించారు.  ఉదయం 9.30 గంటలకు ముద్దవరం చేరుకొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ గ్రామం చేరుకోగానే వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 200 మైలు రాయిని దాటింది. దీంతో గ్రామంలో జెండా ఆవిష్క‌రించి, మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా జ‌న‌నేత‌కు స్థానికులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అక్క‌డి నుంచి ఉదయం 11 గంటలకు వైయ‌స్ జగన్‌ వెంకటగిరి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మర్రికుంట క్రాస్‌రోడు చేరుకున్నారు.  మధ్యాహ్నం 12.30 గంటలకు వైయ‌స్‌ జగన్‌ భోజన విరామం తీసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభించారు.  ప్రజలతో మమేకమవుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాయంత్రం సాయంత్రం 6 గంటలకు వెల్దుర్తి మండలం సర్పరాజపురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలోకి వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర ప్రవేశిస్తుంది. జ‌న‌నేత‌కు ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త కంగాటి శ్రీ‌దేవి ఆధ్వ‌ర్యంలో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. 




డోన్ ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా డోన్ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేసిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు తీపిక‌బురు చెప్పారు.  తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డోన్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఏడాదిలో నియోజకవర్గంలో ప్రజాస్వామ్యయుత వాతావరణం ఏర్పడుతుందంటూ.. టీడీపీ నేతల వర్గ రాజకీయాలతో నలిగిపోతున్న సామాన్యుడికి భరోసానిచ్చారు.  వైయ‌స్ జ‌గ‌న్ హామీతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లకు భ‌రోసా ల‌భించింది.
Back to Top